AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవితో ఉన్న ఈ చిన్నది.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఓ స్టార్ హీరో సతీమణి కూడా..

సోషల్ మీడియాలో నిత్యం వందల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన ఫోటోలు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు శ్రీదేవి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీదేవితో ఉన్న ఈ చిన్నది.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఓ స్టార్ హీరో సతీమణి కూడా..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 21, 2025 | 9:23 PM

Share

సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాని నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను పేపర్ కట్స్ ను పుస్తకాల్లో, లేదా రూమ్ గోడల పై అంటించుకొని ఆరాధించే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఫ్యాన్ పేజ్ లను క్రియేట్ చేసి ఫేవరెట్  హీరోయిన్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరేమో.. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లలో కదలాడుతూ ఉంటాయి.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమాలో గెస్ట్‌రోల్‌లో ప్రభాస్.. కన్నప్ప కంటే ముందే చేశాడు.. ఆ మూవీ ఎదో తెలుసా..?

కాగా పై ఫొటోలో శ్రీదేవితో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్.. అలాగే ఓ స్టార్ హీరో భార్య కూడా.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ జ్యోతిక. నటి జ్యోతిక చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: అప్పుడు యావరేజ్ అన్నారు.. ఇప్పుడు పిచ్చెక్కిపోతున్నారు..! ఓ సినిమా కోసం ఏకంగా అలా కనిపించింది ఈ అమ్మడు

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా చెల్లెలు జ్యోతిక. 1990లలో తమిళ చిత్రసీమలో ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 1998 హిందీ చిత్రం ‘డోలి సజా కే రాగ్నా’లో ఆమె నటిగా రంగప్రవేశం చేసింది. బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన జ్యోతిక అజిత్ నటించిన వాలి సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది.జ్యోతిక తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ సినిమాతో పరిచయం అయ్యింది. అలాగే జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 2006 సెప్టెంబరు 11న స్టార్ హీరో సూర్యను వివాహమాడింది ఈ అందాల తార పెళ్లి తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇది కూడా చదవండి: ఓ తరానికి ఇన్స్పిరేషన్ ఈ హీరోయిన్..! అప్పుడు 96 కేజీలు.. ఇప్పుడు జీరో సైజ్ బ్యూటీ..

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..
200 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం.. వన్డే డెబ్యూలోనే భారీ రికార్డ్..