AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు ఇస్తారో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కథే ఉందిగా!

సినిమాల పరంగా అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అయితే ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ అప్పుడెప్పుడో పాతకాలంలో మొదలైన ఇంటర్వెల్ కల్చర్ ఇప్పటికీ కొనసాగుతోంది? మరి అసలు సినిమా మధ్యలో ఇంటర్వెట్ ఎందుకు ఇస్తారు? దీని వెనకున్న ఆసక్తికర స్టోరీ గురించి తెలుసుకుందాం రండి.

Cinema Interval: సినిమా మధ్యలో 'ఇంటర్వెల్' ఎందుకు ఇస్తారో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కథే ఉందిగా!
Cinema Interval
Basha Shek
|

Updated on: Sep 10, 2026 | 7:05 PM

Share

గతంలో అంత కాకపోయినా మనం కూడా అప్పుడప్పుడు సినిమా థియేటర్లకు వెళతాం. ఇంట్రెస్టింగ్ గా సినిమా చూస్తాం. అలాగే ఇంటర్వెల్ లో పాప్ కార్నో, సమోసానో, కూల్ డ్రింకో తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటాం. మరి ఈ మూవీ ఇంటర్వెల్ కేవలం పాప్‌కార్న్ తినడానికి , కూల్ డ్రింక్ తాగడానికే మాత్రమే ఇచ్చారా? దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. అది చాలా మందికి తెలియదు. గతంలో పోల్చితే ఇప్పుడు థియేటర్లు బాగా మారిపోయాయి. రీల్స్ ప్లేస్ లో డిజిటల్ ప్రొజెక్టర్లు వచ్చాయి. సినిమా వేయడానికి రీళ్లు మార్చాల్సిన పనిలేదు. అయితే ఒకప్పుడు సినిమాలను చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ రీళ్లలో ప్రదర్శించేవారు. పొడవైన సినిమాల్లో ఒక రీల్ అయిపోగానే, ప్రొజెక్షనిస్ట్ మరో రీల్ పెట్టడానికి కొంచెం టైమ్ పట్టేది. అందుకే సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఇచ్చేవారు. అయితే టెక్నాలజీ పెరిగి డిజిటల్ ప్రొజెక్టర్లు వచ్చినా ఇండియాలో ఇంటర్వెల్ మాత్రం పోలేదు. అయితే ఇప్పుడు ఇంటర్వెల్ అనేది చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం. థియేటర్లలో ఎక్కువసేపు కూర్చున్న ప్రేక్షకులకు కాస్త రిలాక్స్ అవ్వడానికి, వాష్‌రూమ్‌కి వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇప్పుడు ఇంటర్వెల్ అనేది సినిమా విజయంలో కీ పాయింట్ గా మారిపోయింది. సినిమాల్లో ఇంటర్వెల్‌కు కొన్ని నిమిషాల ముందు పెద్ద ట్విస్ట్, షాకింగ్ సంఘటన, ఫైట్ లేదా ఊహించని సీన్ పెడతారు. దీన్నే ‘ఇంటర్వెల్ బ్లాక్’ అంటుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఇక ఇంటర్వెల్ ఇప్పుడు కేవలం ప్రేక్షకులకు విరామ సమయం మాత్రమే కాదు థియేటర్లకు ఆదాయం తెచ్చి పెట్టే మార్గం కూడా. ఈ ఇంటర్వెల్ బ్రేక్ లోనే సినిమా జనాలు పాప్‌కార్న్, జ్యూస్, కాఫీ, సమోసా, కూల్ డ్రింక్స్ లాంటివి కొంటారు. దీంతో థియేటర్ల బిజినెస్ పెరుగుతుంది. కాగా ఇప్పుడు చాలా దేశాల్లో ఇంటర్వెల్ లేకుండా సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అంతెందుకు హాలీవుడ్ సినిమాల్లో ఇంటర్వెల్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇంటర్వెల్ బ్లాక్, ట్విస్టులు లాంటివి ఏవీ ఉండవు. కానీ మన దేశంలో మాత్రం ఇంటర్వెల్ అనేది యథావిధిగా కొనసాగుతోంది. ఈ మధ్యన కొన్ని హాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ థియేటర్లలో ఇంటర్వెల్ ఇస్తుంటారు. అందుకే కొన్నిసార్లు ముఖ్యమైన సీన్స్ వస్తున్నప్పుడు సినిమా ఆపేయడంతో ప్రేక్షకులకు చిరాకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us