ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ బాలకృష్ణకు నానమ్మగా నటించిందా.!! ఎవరో తెలుసా.?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు బాలయ్య. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాలు అందుకుంటున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం.

ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ బాలకృష్ణకు నానమ్మగా నటించిందా.!! ఎవరో తెలుసా.?
Balakrishna

Updated on: Aug 18, 2026 | 7:22 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం.. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇటీవలే బాలకృష్ణకు గాయం అవ్వడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే బాలకృష్ణకు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

బాలకృష్ణకు లవర్ గా, భార్యగా, అదేవిధంగా నాయనమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. అలాగే బాలయ్యతో బ్లాక్ బస్టర్స్ లో నటించి మెప్పించింది. ఈ ఇద్దరి కాంబినేషన్ అప్పట్లో ఓ ఊపుఊపేసింది. ఆమె మరెవరో కాదు అందాల భామ సిమ్రాన్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోలందరి సరసన నటించింది సిమ్రాన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఇక బాలకృష్ణతో కలిసి గొప్పంటి అల్లుడు సినిమాలో నటించారు. అలాగే నరసింహారెడ్డి, సీమసింహం, అలాగే ఒక్క మగాడు సినిమా కూడా చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో తాత మనవడిగా నటించారు బాలయ్య. అలాగే సిమ్రాన్ ఇదే సినిమాలో బాలయ్య భార్యగా, నానమ్మగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక సిమ్రాన్ విషయానికొస్తే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంది సిమ్రాన్.

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us