AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

48 మందికి పైగా హీరోయిన్స్‌ పరిచయం చేశా.. ఆమె ఒక్కదానితోనే 25 సినిమాలలు చేశా..

తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు ఆయన. ఆయన జీవితం, ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి, హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు

48 మందికి పైగా హీరోయిన్స్‌ పరిచయం చేశా.. ఆమె ఒక్కదానితోనే 25 సినిమాలలు చేశా..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2026 | 4:15 PM

Share

తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటుడు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా మెప్పించాడు ఈ నటుడు. అలాగే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆయన మరెవరో కాదు దివంగత నటుడు చంద్రమోహన్. ఎందరో స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయున. ఏకంగా 45 మందికి పైగా కథానాయికలను సినీ రంగానికి అందించిన ఈ లెజెండరీ నటుడు, తన కెరీర్ గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

దర్శకుడు కే. విశ్వనాథ్ తన సొంత పెదనాన్న కొడుకేనని, అయితే ఈ విషయం తనకు సినీ పరిశ్రమలోకి వచ్చేవరకు తెలియదని చంద్రమోహన్ పేర్కొన్నారు. తనతో నటించిన భానుప్రియ, రాధిక, విజయశాంతి, సులక్షణ, శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ఎందరో కథానాయికలు స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం కేవలం కాకతాళీయంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

విజయశాంతి, జయప్రదలతో ఎనిమిది చొప్పున చిత్రాలు చేసిన చంద్రమోహన్, జయసుధతో ఏకంగా 25 సినిమాల్లో నటించడం విశేషం. 1970లు, 80లలో జయసుధతో ఆయన జోడీ అత్యంత విజయవంతమైన కలయికలలో ఒకటిగా నిలిచింది. శ్రీదేవితో మాత్రం ఆయన కేవలం ఒక్క సినిమాకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆమె తొలి సినిమా తర్వాత అగ్ర హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగారని, తన చిత్రాల బడ్జెట్‌కు శ్రీదేవిని తీసుకోవడం కష్టమైందని ఆయన వివరించారు. అయినప్పటికీ, తనతో నటించిన అందరు హీరోయిన్లు తాను ఎక్కడ కనిపించినా గౌరవంగా పలకరించేవారని, ఆ బంధం ఒక సెంటిమెంట్‌గా నిలిచిందని చంద్రమోహన్ తెలిపారు. తెలుగు తెరకు దాదాపు 48 మందికి పైగా హీరోయిన్స్‌ను పరిచయం చేసిన ఈ గొప్ప నటుడు 2023లో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us