Tollywood : ప్రతి అమ్మాయి కోరుకునే లవర్ బాయ్.. అతని కథ వింటే కన్నీళ్లు ఆగవు..

|

Oct 18, 2024 | 3:28 PM

ఒకప్పుడు ఆయన ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కేది. అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను.. ప్రతి అమ్మాయి అలాంటి బాయ్ ఫ్రెండ్ తనకు రావాలని కోరుకునేవారు. కానీ అనూహ్యంగా అతని కెరీర్ డీలా పడింది..

Tollywood : ప్రతి అమ్మాయి కోరుకునే లవర్ బాయ్.. అతని కథ వింటే కన్నీళ్లు ఆగవు..
Tollywood
Follow us on

చాలా మంది హీరోలు కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలను అందుకొని ఆతర్వాత అవకాశాలు లేక కనుమరుగవుతుంటారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆయన ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కేది. అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను.. ప్రతి అమ్మాయి అలాంటి బాయ్ ఫ్రెండ్ తనకు రావాలని కోరుకునేవారు. కానీ అనూహ్యంగా అతని కెరీర్ డీలా పడింది.. చేసిన సినిమాలు నిరాశపరిచాయి. ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు.. ఇంతకూ ఆయన ఎవరో కనిపెట్టరా.? లవర్ బాయ్ అనేదానికి నిజమైన అర్ధం అతను. ఆయన ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

పై ఫొటోలో కనిపిస్తున్న హీరో గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు. పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు. ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సినిమాతో హిట్ అందుకోవడమే కాదు అభిమానులను కూడా భారీగా సంపాదించుకున్నాడు. ఇక వరుసగా విజయాలు అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు.

ఇది కూడా చదవండి : Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

ఉదయ్ వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత కూడా ఉదయ్ నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఉదయ్ కెరీర్ పీక్ లో ఉండగానే ఆయన వివాహం చేసుకున్నారు. ఆతర్వాత ఉదయ్ నటించిన సినిమాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఆ తర్వాత మెల్లగా ఉదయ్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకుండా పోయాయి. దాంతో ఉదయ్ కిరణ్ డిప్రషన్ లోకి వెళ్ళాడు.  మానసిక వేదనతో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉదయ్ కిరణ్ మరణం ఆయన అభిమానులతో పాటు తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికి ఆయన అభిమానులు ఉదయ్ ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఉదయ్ సినిమాలు టీవీలో వచ్చినా.. ఆయన సాంగ్స్ వినిపించినా.. తెలియకుండానే ఎమోషనల్ అవుతుంటారు.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.