
ప్రతీనెలా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే జనాలకు నచ్చుతాయి. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు అయితే మరికొన్ని చిన్న సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. మరికొన్ని ఎన్నో హోప్స్‌తో వచ్చినా.. అంతా సక్సెస్ కావు. ఇక కొన్ని సినిమాలైతే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మన జీవితాలను కూడా మార్చుకునేలా ప్రేరేపిస్తాయి. అలాంటి ఓ మైండ్ బ్లోయింగ్ సినిమా నే ఇది. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే వణుకు పుట్టించింది. రూ. 41 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా అటు అవార్డుల్లోనే కాదు.. రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఇందులో నటించిన హీరోయిన్ రెమ్యునరేషన్ రూ.11 రూపాయిలేనని తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఈ సినిమా ఏంటి, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘ఫ్లయింగ్ సిఖ్’గా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘భాగ్ మిల్కా భాగ్’. 2013లో విడుదలైన ఈ బయోపిక్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది పట్టుదల, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే ఒక గొప్ప సందేశం. దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మిల్కా సింగ్ పాత్రలో ఫర్హాన్ అక్తర్ నటన ప్రేక్షకులను, విమర్శకులను కూడా మెప్పించింది.
‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా వాణిజ్యపరంగానే కాకుండా, అవార్డుల పరంగా కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఏకంగా 55 అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 41 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిల్కా సింగ్ జీవితంలోని కష్టాలు, పోరాటాలు, విజయాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ, సోనమ్ కపూర్ కూడా ‘బిరో’ పాత్రలో తన నటనతో మంచి మార్క్ వేసింది. ఓ షాకింగ్ విషయం ఏంటంటే.. సోనమ్ ఈ సినిమా కోసం కేవలం రూ.11 రూపాయిలు మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకుంది. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ నటన సినిమాకే హైలెట్. అయితే, సోనమ్ కపూర్ కూడా ‘బిరో’ పాత్రలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి