AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్ని.. ఈవిడ ఆవిడేనా.!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్

ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కోరుకునేవాడు.. అంతలా తన అందంతో మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

వార్ని.. ఈవిడ ఆవిడేనా.!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 8:45 AM

Share

ఒకానొక సమయంలో స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీని ఏలిన దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఈ టాప్ దర్శకుడు. అందమైన ప్రేమ కథలకు తనదైన స్టైల్ లో కామెడీని జోడించి మంచి విజయాలను అందుకున్నారు శ్రీను వైట్ల. కాగా శ్రీను వైట్ల కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాల్లో ఆనందం సినిమా ఒకటి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాల్లో ఆనందం ముందు వరసలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఆకాష్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.. అలాగే రెండు కేంద్రాలలో 200 రోజులు ఆడింది ఈ సినిమా..

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

2001 అందమైన ప్రేమ కథతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఉంది. ఇక ఈ సినిమాలో మరో ప్రేమ కథను కూడా చూపించాడు శ్రీను వైట్ల. వెంకట్, తను రాయ్ ల మధ్య మంచి ఫీల్ ఉండే కథ ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించిన తను రాయ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆ సినిమాలో ఎంతో అమాయకంగా అద్భుతంగా నటించి మెప్పించింది తను రాయ్.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

ఈ సినిమా తర్వాత తను రాయ్ పలు సినిమాల్లో నటించింది అలాగే చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది ఈ బ్యూటీ. తమిళం , మలయాళం , బెంగాలీ, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ సినిమాలు తగ్గించింది. అప్పుడెప్పుడో ఆర్జీవీ తెరకెక్కించిన అప్పర్ రాజు సినిమాలో కనిపించింది. ఆతర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. సోషల్ మీడియాలోనూ తను రాయ్ పెద్దగా యాక్టివ్ గా లేదు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎక్కడా లేవు. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుంది అని నెటిజెన్స్ ఆరాతీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

Aanandam

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us