సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది

|

Aug 03, 2024 | 9:32 PM

90వ దశకంలో నాగార్జున, హరికృష్ణ, రవితేజ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'సీతారామరాజు'. దర్శకుడు వైవిఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఇందులో నాగార్జున, హరికృష్ణ ముద్దుల చెల్లెలు సుమ పాత్రలో నటించింది హీరోయిన్ మాన్య.

సీతారామరాజు మూవీలో రవితేజ లవర్ గుర్తుందా.? ఇప్పుడేంటి ఇంతలా మారిపోయింది
Viral
Follow us on

90వ దశకంలో నాగార్జున, హరికృష్ణ, రవితేజ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘సీతారామరాజు’. దర్శకుడు వైవిఎస్ చౌదరి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఇందులో నాగార్జున, హరికృష్ణ ముద్దుల చెల్లెలు సుమ పాత్రలో నటించింది హీరోయిన్ మాన్య. చక్కనైన నవ్వు, గుండ్రటి కళ్లతో ప్రేక్షకులను అలరించిన మాన్య.. ఈ సినిమాలో తెలుగింటి అమ్మాయిలా తన నటనతో అందరినీ అలరించింది. తొలుత చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్య.. ఆ తర్వాత సహాయ నటిగా ఆకట్టుకుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సీతారామరాజు, దేవా, సాహసబాలుడు-విచిత్ర కోతి, బ్యాచలర్స్, సాంబయ్య, కాలేజీ, లవ్, శివన్న, గణపతి, ప్రేమకు స్వాగతం, బ్రహ్మచారులు, తమాషా లాంటి చిత్రాలతో తనకంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాన్య. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దర్శన్‌తో నటించిన ‘శాస్త్రి’ మూవీతో ఒక్కసారిగా తిరుగులేని ఫేం సంపాదించింది.

వరుసగా అవకాశాలు వస్తుండగా.. 2007లో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన మాన్య. 2008లో సత్యపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని.. 2010 నుంచి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. వివాహం అయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మాన్య 2013లో వికాస్‌ బాజ్‌పేయిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత న్యూయార్క్‌కి వెళ్లింది. అక్కడ క్రెడిట్ సూయిస్‌లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వాటిపై కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.