
టాలీవుడ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న భామలు చాలామందే ఉన్నారు. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసి.. వరుస అవకాశాలతో దూసుకుపోతారని భావించిన కొందరు హీరోయిన్లు మాత్రం అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఒకప్పుడు తమ గ్లామర్‌తో యువతను ఆకట్టుకున్న అలాంటి తారల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు. నీలికళ్లతో అచ్చం ఐశ్వర్య రాయ్‌ను తలపిస్తూ అప్పట్లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా. ? పైన కనిపిస్తున్న అందాల భామ మరెవరో కాదు.. స్నేహా ఉల్లాల్. బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్‌ను పోలిన రూపంతో ఈ అమ్మడు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె నీలికళ్లు, అందమైన ముఖం యువతను ఫిదా చేశాయి. దీంతో ఈ బ్యూటీకి జూనియర్ ఐశ్వర్య రాయ్ అనే గుర్తింపు కూడా వచ్చింది. 2007లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్నేహా ఉల్లాల్. ఈ చిత్రంలో తన అందం, నటనతో ఆకట్టుకోవడమే కాకుండా.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
కొత్త హీరోయిన్ అయినప్పటికీ యూత్‌లో ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని చాలామంది భావించారు. తొలి సినిమా విజయంతో వచ్చిన గుర్తింపును కొనసాగిస్తూ స్నేహా ఉల్లాల్.. కరెంట్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహా చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించింది. అయినప్పటికీ స్నేహా ఉల్లాల్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. రెండు విజయవంతమైన చిత్రాల్లో భాగమైనా.. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకోలేకపోయింది. వరుడు, అలా మొదలైంది వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ, అవి ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.
ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి మడత కాజా సినిమాలో నటించింది స్నేహా ఉల్లాల్. కానీ ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం యాక్షన్ 3D, అంతా నీ మాయలోనే వంటి సినిమాల్లోనూ కనిపించింది. అయినప్పటికీ, ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం దక్కలేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఒకప్పుడు గ్లామర్‌తో, ప్రత్యేకమైన రూపంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. సరైన కథలు, వరుస విజయాలు లేకపోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. స్నేహా ఉల్లాల్ చివరిసారిగా 2022లో విడుదలైన హిందీ చిత్రం లవ్‌యూ లోక్‌తంత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమె కొత్త సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అభిమానుల్లోనూ ఆమె గురించి చర్చ జరుగుతోంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, గ్లామరస్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.