Tollywood: మిర్రర్ ముందు సెల్ఫీతో ఫోజిచ్చిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా..? ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

ఇన్నాళ్లు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఈ వయ్యారి మొదటిసారి సీనియర్ టాప్ హీరోకు జోడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అమ్మడు ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బ్యూటీ..

Tollywood: మిర్రర్ ముందు సెల్ఫీతో ఫోజిచ్చిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా..? ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..
Actress 2
Follow us

|

Updated on: Jun 16, 2024 | 6:09 PM

మిర్రర్ ముందు సెల్ఫీతో ఫోజిచ్చిన ఈ వయ్యారిని గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో అనేక సూపర్ హిట్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇన్నాళ్లు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించిన ఈ వయ్యారి మొదటిసారి సీనియర్ టాప్ హీరోకు జోడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అమ్మడు ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బ్యూటీ.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆ మిర్రర్ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత. చాలా కాలం తర్వాత ఇలా సెల్ఫీ తీసుకుంటూ పిక్ షేర్ చేసింది. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచమయైన సామ్.. ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసింది.

జెస్సీ పాత్రలో అభిమానుల మనసులు దొచిన సామ్.. తక్కువ సమయంలోనే వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళంలో అందరూ హీరోల సరసన నటించి అలరించింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, విజయ్ దళపతి ఇలా అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సామ్.. కొన్నాళ్లుగా అసలు సినిమాల్లో కనిపించడం లేదు. ఖుషి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇన్నాళ్లు మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంది. కానీ అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హెల్త్ అప్డేట్స్ ఇస్తుంది. అలాగే మయోసైటిస్ నుంచి తాను ఎలా కోలుకుంటున్నాను అనే విషయాన్ని కూడా తన పాడ్ కాస్ట్ ద్వారా తెలియజేస్తుంది.

ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు తన సొంత నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ప్రాజెక్టులో ఈ వయ్యారి కనిపించనుందని టాక్. మలయాళంలో సమంతకు ఇదే మొదటి సినిమా. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా సమంత లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles