
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 110 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ఘనవిజయం సాధించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ దుమ్ములేపింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కామెబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మరోసారి బాలయ్య గోపిచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా చారిత్రాత్మక కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ విలన్ గా నటించిన ఏకైక సినిమా ఎదో తెలుసా.? బాలయ్య హీరోగా ఎలా అదరగొడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలకృష్ణ విలన్ గానూ దడదడలాడించారు. ఇంతకూ బాలయ్య విలన్ గా నటించిన సినిమా ఎదో తెలుసా.? అది ఎదో కాదు సుల్తాన్. ఈ సినిమాలో బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు కలిసి నటించారు. ఈ సినిమాలో 1999లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ఈ సినిమాలో రచన, రోజా, దీప్తీ భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు.
ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. హీరోగానే కాదు విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య విలన్ గా అదరగొట్టారు. సినిమా చివరి వరకు బాలయ్య విలన్ గా గడగడలాడించారు. చివరి పది నిమిషాల్లో బాలయ్య మారిపోతారు . కానీ సినిమాలో మాత్రం బాలయ్య రెండు పాత్రల్లో అద్భుతంగా నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.