AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఏంటీ.. చిరంజీవి, రమ్యకృష్ణ అన్నా చెల్లెలుగా నటించారా.. ? ఏ సినిమా అంటే..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటిగా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు విశ్వంభర సినిమాతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Megastar Chiranjeevi: ఏంటీ.. చిరంజీవి, రమ్యకృష్ణ అన్నా చెల్లెలుగా నటించారా.. ? ఏ సినిమా అంటే..
Chiranjeevi, Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 5:04 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. దశాబ్దాల సినీప్రయాణంలో చిరు ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల నుంచి ఇప్పుడు కుర్ర భామలతో కలిసి నటిస్తున్నారు. ముఖ్యంగా రాధ, రాధిక, రమ్యకృష్ణ, సౌందర్య, మీనా వంటి స్టార్ హీరోయిన్లతో అనేక చిత్రాల్లో నటించారు. ఇక చిరు సరసన కథానాయికగా నటించిన రమ్యకృష్ణ.. ఒక సినిమాలో చిరు చెల్లిగా నటించిందని మీకు తెలుసా.. ? అవును.. మీరు విన్నది నిజమే.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..

చిరంజీవి, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన మొదటి సినిమా ముగ్గురు మొనగాళ్లు. కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా అల్లుడా మజాకా సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతోపాటు ఇద్దరు కలిసి కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇద్దరు మిత్రులు చిత్రంలోనూ నటించారు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు కలిసి మరో సినిమా చేయలేదు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

ఇదిలా ఉంటే.. చిరు సరసన హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ.. చక్రవర్తి అనే సినిమాలో మాత్రం చిరు చెల్లిగా కనిపించింది. ఇందులో వీరిద్దరు అన్నా చెల్లెలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. చక్రవర్తి సినిమా విడుదలైన ఏడేళ్లకు ముగ్గురు మొనగాళ్లు సినిమా వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌