Tollywood: ఒక్క టీవీ షో.. ఆ హీరోకు రూ.2200 కోట్ల సినిమా వచ్చేలా చేసింది.. ఎవరంటే..

| Edited By: Shaik Madar Saheb

Oct 12, 2024 | 7:26 AM

హీరో అంటే యాక్షన్, ఫైట్ సీన్స్, పాటలు మాత్రమే కాదు.. కంటెంట్ నచ్చితే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంటారు. తన ప్రయత్నాలన్నింటిలో పూర్తి కృషిని అందించాలని కోరుకుంటాడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, టీవీ షో హోస్ట్ గా.. ఇలా అన్నింటిలోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విద్య, సమానత్వం వంటి సామాజిక అంశాలను తన సినిమాల్లో ప్రస్తావించి గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.

Tollywood: ఒక్క టీవీ షో.. ఆ హీరోకు రూ.2200 కోట్ల సినిమా వచ్చేలా చేసింది.. ఎవరంటే..
Actor
Follow us on

భారతదేశంలోని ప్రముఖ నటుల్లో ఒకరు టీవీ షో ద్వారా ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.2200 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాను రూపొందించడానికి ఓ టీవీ షో కారణమైందంటే మీరు నమ్ముతారా.. అవును.. ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన ఆ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హీరో అంటే యాక్షన్, ఫైట్ సీన్స్, పాటలు మాత్రమే కాదు.. కంటెంట్ నచ్చితే ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంటారు. తన ప్రయత్నాలన్నింటిలో పూర్తి కృషిని అందించాలని కోరుకుంటాడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, టీవీ షో హోస్ట్ గా.. ఇలా అన్నింటిలోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. విద్య, సమానత్వం వంటి సామాజిక అంశాలను తన సినిమాల్లో ప్రస్తావించి గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. అతను మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్.

అమీర్ ఖాన్ కొన్నాళ్ల క్రితం టీవీలో “సత్యమేవ జయతే” అనే షోను హోస్ట్ చేశాడు. ఇది భారతదేశంలో ఉన్న సామాజిక సమస్యలపై చర్చించే కార్యక్రమం. ఈ షో ద్వారా సంఘ సంస్కర్తగా పేరుగాంచిన అమీర్ ఖాన్ 2013లో టైమ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చేరారు. 2014లో సత్యమేవ జయతే మూడో సీజన్‌కు అమీర్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఒకే ఎపిసోడ్‌లో ఇద్దరు అమ్మాయిలను పరిచయం చేశాడు. ఆ అమ్మాయిలు ఎదుర్కొన్న పోరాటాలను, లెక్కలేనన్ని సవాళ్లను ఎలా అధిగమించి చరిత్ర సృష్టించారో అమీర్ ఖాన్ పంచుకున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. రెజ్లర్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్. వీరిద్దరి జీవితాలను ఆధారంగా చేసుకుని దంగల్ సినిమాను రూపొందించాడు.

ఇవి కూడా చదవండి

2016లో ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దంగల్ విడుదలైన 11 రోజుల్లో రూ.374.43 కోట్లు వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.2,207 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2200 కోట్లు వసూలు చేయడానికి ఓ టీవీ షో కారణమైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.