Allu Arjun: ఏంటీ.. సుకుమార్ డైరెక్షన్‏లో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడా..? కెరీర్ ప్రారంభంలోనే అలాంటి మూవీలో బన్నీ..

కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun: ఏంటీ.. సుకుమార్ డైరెక్షన్‏లో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడా..? కెరీర్ ప్రారంభంలోనే అలాంటి మూవీలో బన్నీ..
Allu Arjun, Sukumar
Follow us

|

Updated on: Jul 28, 2024 | 12:30 PM

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బన్నీ కెరీర్ మలుపు తిప్పింది పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు బన్నీ. అంతేకాదు.. ఈ మూవీ సైమా అవార్డ్ వేడుకలోనూ సత్తా చాటింది. పుష్ప మూవీ ఏకంగా ఆరు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాందిచుకున్నాడు బన్నీ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో నెట్టింట వైరలవుతుంది.

కెరీర్ ఆరంభం నుంచి తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ తో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు బన్నీ. ప్రస్తుతం భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న బన్నీ కెరీర్ ప్రారంభంలోనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?. అది కూడా తన ప్రాణ స్నేహితుడు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలోనే. ఐ యామ్ దట్ చేంజ్ అనే శీర్షికతో ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘ఐ యామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. అలాగే ఈ సినిమాకు నిర్మాతగా కూడా వర్క్ చేశాడు.

కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో “మన కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి. మార్పు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పు నేనే. అలా మారండి” అని చెప్పుకొచ్చారు బన్నీ. ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే తనకు సరికొత్త గౌరవం వచ్చిందని బన్నీ గతంలోనే చెప్పారు. తాను ఎప్పుడూ సామాజిక అవగాహన ప్రకటనలను మంచి ఉద్దేశ్యంతో రూపొందించడం చూశాను. వారి ఉద్దేశ్యాలు గొప్పవని అన్నారు. తన అభిమానులు, స్నేహితులు, విద్యార్థులు చాలా మంది తమవంతుగా సమాజానికి సేవ చేస్తున్నారని. అందుకే తాను కూడా ఈ సమాజానికి ఏదైనా చేయాలనుకున్నానని.. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ తీశానని గతంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హోటల్, రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత సోంపు ఎందుకు ఇస్తారు?
హోటల్, రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత సోంపు ఎందుకు ఇస్తారు?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడని తెలుసా..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ చేశాడని తెలుసా..
UPSC కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరదనీరు.. ముగ్గురు మృతి
UPSC కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరదనీరు.. ముగ్గురు మృతి
గొంతు నొప్పితో నరకం చూస్తున్నారా.. ఇలా చేయండి చిటికెలో మాయం..
గొంతు నొప్పితో నరకం చూస్తున్నారా.. ఇలా చేయండి చిటికెలో మాయం..
క్లాస్‌రూమ్‌లో గుర్రుపెట్టిన టీచర్ ..చెమటలు పట్టకుండా చిన్నారులతో
క్లాస్‌రూమ్‌లో గుర్రుపెట్టిన టీచర్ ..చెమటలు పట్టకుండా చిన్నారులతో
ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల లేటెస్ట్ వాటర్ రిపోర్ట్....
ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల లేటెస్ట్ వాటర్ రిపోర్ట్....
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
పేరు మార్చుకున్న పూరీ కొడుకు.. మరి ఇలా అయినా హిట్టు వచ్చేనా.?
మ్యూచువల్ ఫండ్స్‌పై బడ్జెట్ ఎఫెక్ట్..!
మ్యూచువల్ ఫండ్స్‌పై బడ్జెట్ ఎఫెక్ట్..!
వెంకీ 'ఘర్షణ' విలన్ గుర్తున్నాడా..?
వెంకీ 'ఘర్షణ' విలన్ గుర్తున్నాడా..?
ఇలాంటి మెసేజ్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే..!
ఇలాంటి మెసేజ్‌లను క్లిక్‌ చేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే..!