Ashok Galla’s Hero: ఆ కుర్ర హీరో నో చెప్పిన కథనే అశోక్ గల్లా ఓకే చేశాడట.. అతను ఎవరో తెలుసా..?

సూపర్ సార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

Ashok Gallas Hero: ఆ కుర్ర హీరో నో చెప్పిన కథనే అశోక్ గల్లా ఓకే చేశాడట.. అతను ఎవరో తెలుసా..?
Ashok

Updated on: Jan 12, 2022 | 7:23 PM

Ashok Galla: సూపర్ సార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కుర్ర హీరో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో అశోక్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాంశంతో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా గల్లా అరుణకుమారి సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటగా అశోక్ కాకుండా ఓ కుర్ర హీరోను అనుకున్నారట.

హీరో సినిమా కథ మొదటగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య  యంగ్ హీరో నితిన్ కు వినిపించారట. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టును నో చెప్పాడట. దాంతో ఈ కథను అశోక్ కు వినిపించాడట దర్శకుడు. లేకుంటే ఈ సినిమాలో హీరోగా నితిన్ ఉండేవాడు. చిన్నతనం నుంచి సినిమా హీరో కావలని కలలుగానే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి అతను ఎలా బయట పడ్డాడు అనే కథతో ఈ సినిమా రాబోతుంది. ఇటీవలే రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ నుంచి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు భీష్మ సినిమా తర్వాత నితిన్ అనుకున్న స్థాయిలో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే సినిమా చేస్తున్నాడు. ఇక హీరో సినిమా పై అశోక్ చాలా నమ్మకంగా ఉన్నాడు. సినిమా తప్పకుండ ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్

Loading...
Unable to load recommendations.
Follow Us