Jayanth C Paranjee: త్రిషకు అతనితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

|

Jun 04, 2023 | 6:26 PM

దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచింది. అప్పట్లో మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న జయంత్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందాలు తాను దర్శకత్వం వహించిన సినిమాలు హిట్స్, ప్లాప్స్ కావడంపై స్పందించారు. ఈ క్రమంలోనే తీన్ మార్ సినిమా ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Jayanth C Paranjee: త్రిషకు అతనితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
Trisha
Follow us on

డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ అందుకున్న వన్ ఆఫ్ ది డైరెక్టర్. ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా.. వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అయితే చాలా కాలంగా ఆయన మరో ప్రాజెక్ట్ రూపొందించలేదు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్.. అదే స్థాయిలో ప్లాపులు కూడా చవిచూశారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ ఒకటి. దశాబ్ద కాలం కితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచింది. అప్పట్లో మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉన్న జయంత్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందాలు తాను దర్శకత్వం వహించిన సినిమాలు హిట్స్, ప్లాప్స్ కావడంపై స్పందించారు. ఈ క్రమంలోనే తీన్ మార్ సినిమా ఫెయిల్ కావడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“తీన్ మార్ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఈ మూవీ స్టోరీ మాత్రం నాకిప్పటికీ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తుంది. అయితే ఆ మూవీ ఫెయిల్ కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నేను చెప్పలేను. నాకు తెలిసినంతవరకు పవర్ స్టార్ ఇమేజ్ కు ఇది సరిపోలేదు. కొంతమంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్ తో పెళ్లి చేయడం… ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లకు నచ్చలేదు. ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోల్లో ఎవరో ఒకరితో తీసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో” అని అన్నారు.

పవర్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన తీన్ మార్ సినిమాలో త్రిష, కృతి కర్బంద కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా తీన్ మార్ రూపొందించారు. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈసినిమా మ్యూజిక్ పరంగా శ్రోతలను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.