Jr NTR : సింహాద్రి.. వీరసింహారెడ్డి సినిమాలకు ఉన్న పోలిక ఇదే.. గోపీచంద్ మలినేని చెప్పిన సీక్రెట్

|

May 18, 2023 | 7:45 AM

జక్కన్న డైరెక్షన్, తారక్ మాస్ యాక్షన్ ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి. అలాగే కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది.

Jr NTR : సింహాద్రి.. వీరసింహారెడ్డి సినిమాలకు ఉన్న పోలిక ఇదే.. గోపీచంద్ మలినేని చెప్పిన సీక్రెట్
Simhadri
Follow us on

యంగ్ టైగర్ సెన్సేషనల్ హిట్ సింహాద్రి సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే తారక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కు రెడీ అవుతోంది. జక్కన్న డైరెక్షన్, తారక్ మాస్ యాక్షన్ ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి. అలాగే కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక, అంకిత హీరోయిన్స్ గా నటించారు. 2003లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా.. అపట్లో భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే.

తారక్ పుట్టిన రోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో మరోసారి రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్ చేశారు.

ఈ ఈవెంట్ కు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యారు. ఇటీవలే ఈ దర్శకుడు నటసింహం బాలకృష్ణ తో కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక సింహాద్రి ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి సినిమాకు సింహాద్రి సినిమా కు ఉన్న పోలిక చెప్పారు. సింహాద్రి ఇంట్రవెల్ సీన్ లో భూమిక ఎన్టీఆర్ ను పొడిచే సీన్.. వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి బాలయ్య ను పొడిచే సీన్ రెండు థియేటర్స్ లో దద్దరిల్లుతాయని.. ఆయా సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయని అన్నారు. గోపీచంద్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.