అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. ఆమె చాలా లేజీ..! డాన్స్ విషయంలో గొడవ చేసింది

ఒకానొక సమయంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి. కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులోను విశేషంగా మెప్పించారు నాగేశ్వర రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఓ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు

అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. ఆమె చాలా లేజీ..! డాన్స్ విషయంలో గొడవ చేసింది
G. Nageswara Reddy

Updated on: May 24, 2026 | 11:29 AM

దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు నాగేశ్వర రెడ్డి. ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి సినిమాల స్పీడ్ తగ్గించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగేశ్వర రెడ్డిఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఓ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తన ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్ నమితతో తలెత్తిన వివాదాన్ని వివరించారు. ఈ సంఘటన ఒక డ్యాన్స్ స్టెప్‌కు సంబంధించి జరిగింది. డ్యాన్స్ మాస్టర్ దినేష్ కంపోజ్ చేసిన ఒక స్టెప్‌ను శ్రీకాంత్, ప్రభుదేవా, నమితలతో కాంబినేషన్ లో వచ్చిన పాటలో భాగంగా నమిత చేయనని చెప్పింది. దాదాపు 9 గంటలకు ప్రారంభమైన షూటింగ్‌లో, ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ స్టెప్‌ను చేయనని నమిత చెప్పడంతో సమస్య మొదలైంది. నాగేశ్వర రెడ్డి నమితను “లేజీ హీరోయిన్”అన్నారు, నేను ఇంతవరకు ఇలాంటి హీరోయిన్ ను ఎప్పుడూ చూడలేదు. ఆమె షూటింగ్ అయిపోగానే విశ్రాంతి తీసుకుంటుందని, షాట్ పిలవగానే వస్తుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : నన్ను కాదని ఆ హీరోయిన్‌ను తీసుకుంటారా.? ఆ సినిమా విషయంలో త్రిష గొడవ

ఆమె ఎక్కువ మాట్లాడదని, హీరోలు, దర్శకులు, నిర్మాతల వంటి ఎవరితోనూ ఎక్కువగా కలివిడిగా ఉండదని తెలిపారు. నమిత నిరాకరించినప్పుడు, “ఎందుకు చేయవు, చేయాల్సిందే” అని తాను అడిగానని దర్శకుడు నాగేశ్వర రెడ్డి తెలిపారు. దీనికి నమిత “నాకు బాగా తెలుసు మీరు నన్ను దేని కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారో” అని నేరుగా సమాధానం ఇచ్చింది. ఈ వివాదంపై నమితతో ఉన్న కపూర్ అనే వ్యక్తిని పిలిపించి సమస్యను వివరించారట నాగేశ్వర రెడ్డి. అతను వెళ్లి మాట్లాడిన తర్వాత నమిత ఒప్పుకుందట. అయితే ఆమె ఓకే అన్న తర్వాత హీరో శ్రీకాంత్ స్పందిస్తూ, నమిత తనకు స్టెప్ చేయనని చెప్పినప్పుడు, తాను ఆ స్టెప్ ఎందుకు చేయాలని.. “టిట్ ఫర్ టాట్”లా ఆ స్టెప్‌ను తీసివేయమని, వేరే స్టెప్ పెట్టమని శ్రీకాంత్ చెప్పారట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చాలా అందగాడు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే.. జాన్వీ క్రేజీ కామెంట్స్

శ్రీకాంత్‌ను ఇగోలు లేని గొప్ప వ్యక్తి అని నాగేశ్వర రెడ్డి అన్నారు. చివరకు ఆ స్టెప్‌ను మార్చారట. ఆ పాట, “శ్రీరామచంద్ర సిగ్గే గోవిందా” పెద్ద హిట్ అయ్యింది. నమిత నిరాకరించిన ఆ స్టెప్‌ను తర్వాత ప్రభుదేవాకు కన్విన్స్ చేసి ఆకు వక్క వేసి అనే పాటలో ఉపయోగించినట్లు దర్శకుడు తెలిపారు. నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఆ సమయంలో బొంబాయి నుంచి వచ్చే హీరోయిన్స్‌లో కొందరు సినిమా రంగం గురించి అపోహలు కలిగి ఉంటారని, అలాంటి ఒత్తిళ్లకు గురవుతారని భావిస్తారని తెలిపారు. నమిత కూడా డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని భావించి ఉండవచ్చని అన్నారు.

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో తిరుగులేని విలన్.. కట్ చేస్తే చివరి రోజుల్లో డబ్బులు లేక జాతకాలు చెప్పుకుంటూ..

నమిత ఇన్ స్టాగ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us