Nayanthara: నయన్‌- విఘ్నేశ్‌ల ప్రేమకు పునాది వేసింది ఆ స్టార్ హీరోనే.. అసలు మ్యాటర్ అదా!

|

Apr 06, 2024 | 8:40 PM

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ జంట ఒకటి. ఒక సినిమా షూటింగ్‌లోనే వీరు మొదటిసారిగా పరిచయమయ్యారు. ఆతర్వాత మంచి స్నేహితులయ్యారు. ఆపై ప్రేమగా చిగురించింది. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పక్షులు 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు

Nayanthara: నయన్‌- విఘ్నేశ్‌ల ప్రేమకు పునాది వేసింది ఆ స్టార్ హీరోనే.. అసలు మ్యాటర్ అదా!
Nayanthara, Vignesh Shivan
Follow us on

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ జంట ఒకటి. ఒక సినిమా షూటింగ్‌లోనే వీరు మొదటిసారిగా పరిచయమయ్యారు. ఆతర్వాత మంచి స్నేహితులయ్యారు. ఆపై ప్రేమగా చిగురించింది. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ ప్రేమ పక్షులు 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. ఇక సరోగసి పద్ధతిలో ఉయిర్‌, ఉలగం అని ఇద్దరు కుమారులకు కూడా అమ్మానాన్నలయ్యారీ లవ్లీ కపుల్. ఇదిలా ఉంటే తనకు, నయనతారకు మధ్య ప్రేమ పుట్టడానికి ఒక స్టార్ హీరో కారణమంటున్నాడు విఘ్నేశ్ శివన్. అతనెవరో కాదు ధనుష్. అవును. ఈ విషయాన్ని స్వయంగా విక్కీనే బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను నయనతారతో లవ్, రిలేషన్ షిప్, పెళ్లి తదితర విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాఉ.

 

ఇవి కూడా చదవండి

‘ నా మొదటి సినిమా నానుమ్‌ రౌడీ ధాన్ (తెలుగులో నేను రౌడీనే)‌ కథ నయనతారకు చెప్పమని ధనుష్‌ సారే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈ సినిమా స్క్రిప్ట్‌ నచ్చలేదన్న విజయ్‌ సేతుపతి నయన్‌ ఓకే చేప్పిందగానే ఆలోచించకుండా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల తెలిసో తెలియక నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ఇద్దరి మధ్య ప్రేమకు పునాది వేసింది ధనుషే’ అని చెప్పుకొచ్చాడు విక్కీ. నానుమ్‌ రౌడీ ధాన్‌ మూవీకి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 2015 లో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది.

నానామ్‌ రౌడీధాన్‌ సినిమా గురించి విక్కీ మాటల్లో..

నానామ్‌ రౌడీధాన్‌ సినిమా షూటింగ్ లో నయన తార, విఘ్నేశ్ శివన్.. వీడియో ఇదిగో..

నానామ్‌ రౌడీధాన్‌ సినిమాకు నిర్మాతగా హీరో ధనుష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.