Abhiram Daggubati : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రానా సోదరుడు

సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా మంది కహీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమా రంగంలో అలా వచ్చే రాణిస్తున్నారు. ఇక టాలెంట్ లేకపోతే ప్రజలు ఎంత స్టార్ హీరో కొడుకైన

Abhiram Daggubati : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రానా సోదరుడు
Daggubati Abhiram

Updated on: Mar 14, 2021 | 3:57 AM

Abhiram Daggubati : సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడం కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా మంది కహీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమా రంగంలో అలా వచ్చే రాణిస్తున్నారు. ఇక టాలెంట్ లేకపోతే ప్రజలు ఎంత స్టార్ హీరో కొడుకైన, ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న యాక్సప్ట్ చేయరు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలా మంది వరసలు తమ టాలెంట్ తో హీరోలుగా రాణిస్తున్నారు. తాజాగా మరో స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని తెలుస్తుంది. అతను ఎవరో కాదు టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్  చిన్న కుమారుడు, యంగ్ హీరో రానా సోదరుడు అభిరామ్.

అభిరామ్ ఎంట్రీ గురించి గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే త్వరలోనే ఈ కుర్రాడు హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడని తెలుస్తుంది. అయితే అభిరామ్ ను ఏ దర్శకుడు పరియచయం చేయబోతున్నాడన్నదని పైన కూడా చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అభిరామ్ ను దర్శకుడు తేజ పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది. మొదట్లో డైరెక్టర్ రవిబాబు అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తేజ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం తేజ చిత్రం సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో అభిరామ్ హీరోగా నటించే అవకాశం ఉందని ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక తేజ యాక్షన్ హీరో గోపీచంద్ తో ‘అలివేలు మంగ వేంకటరమణ’ అనే సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rana Daggubati : వెంకటేష్ ‘దృశ్యం 2’లో కీలకపాత్రలో రానా.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటివారబ్బాయి

Rang De : పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకోవద్దంటున్న నితిన్.. ‘రంగ్ దే’ మరోసాంగ్..

సిరివెన్నెల కాలంనుంచి జాలువారిన మరో అందమైన పాట.. ‘టక్ జగదీష్’నుంచి “కోలో కోల‌న్న కోలో కొమ్మ‌లు” అనే సాంగ్

Follow Us