AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిపీటలెక్కనున్న బ్రమ్మముడి అప్పు.. సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రియుడితో ఎంగేజ్మెంట్

సినిమాలతో పాటు సీరియల్స్ కు కూడా మనదగ్గర విపరీతమైన క్రేజ్ ఉంటుంది. చాలా మంది సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లోనూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు కొందరు.. వారిలో ఈ అమ్మడు ఒకరు. బ్రహ్మముడి సీరియల్ తో పాపులర్ అయిన నటి అప్పు.

పెళ్లిపీటలెక్కనున్న బ్రమ్మముడి అప్పు.. సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రియుడితో ఎంగేజ్మెంట్
Brahmamudi Serial
Rajeev Rayala
|

Updated on: Jul 16, 2025 | 10:39 AM

Share

సినిమాలతో సమానంగా సీరియల్స్ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరో పక్క సీరియల్స్ ఏడాది పొడవునా సాగుతూ.. ఇంట్లో ఉండేవారిని అలరిస్తున్నాయి. ఒకొక్క సీరియల్ మినిమమ్ రెండు, మూడు ఏళ్ళు నడుస్తుంటాయి.. దానికి కారణం ఆ సీరియల్స్ ను ప్రేక్షకులు అంతలా ఆదరించడమే. ఇప్పటికే చాలా సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కోసం ఆడవాళ్లే కాదు ఈ మధ్య మగవాళ్లు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. టీవీ చూసే టైం లేకపోతే ఫోన్ లలోనూ సీరియల్స్ చూస్తున్నారు కొందరు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో నటించే చాలా మంది ప్రేక్షకుల ఫెవరెట్ అయిపోతున్నారు. వారిలో పైన కనిపిస్తున్న అమ్మాయి ఒకరు.

ఇది కూడా చదవండి : ఈయన ఆయనేనా..! ఏంటీ.. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!! గుర్తుపట్టారా మావ

బ్రహ్మముడి సీరియల్లో అప్పు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ టామ్ బాయ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది ఆ చిన్నది. ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా..? స్టార్ మా ఛానల్లో బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్‏తో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఇందులోని కావ్య, స్వప్న, అప్పు, రాజ్, కళ్యాణ్, రాహుల్ పాత్రలు ఎక్కువగా జనాలకు కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ సీరియల్లో అందరికి తెగ నచ్చేసిన క్యారెక్టర్ అంటే అప్పుదే. ఆమె అసలు పేరు నైనిషా రాయ్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు

నైనిషా రాయ్ చాలా అందంగా ఉంటుంది. సీరియల్ లో అలా టామ్ బాయ్ లా కనిపిస్తుంది కానీ బయట ముద్దుగా ఉంటుంది ఈ భామ. త్వరలోనే ఈ చిన్నది పెళ్లిపీటలెక్కనుంది. ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో నైనిషా రాయ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నైనిషా రాయ్ మొత్తానికి తన ప్రియుడిని పెళ్లాడనుంది. ఈ ఫోటోల పై నెటిజన్స్ విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!

View this post on Instagram

A post shared by Nainisha (@nainisha_rai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు