సినిమా ఇండస్ట్రీలో చాలా మంది జీవితకథలు సినిమాలుగా వచ్చిన విషయం తెలిసిందే.. చాలా మంది బయోపిక్ లు వెండి తెరపైకి వచ్చాయి. రాజకీయనాయకుల జీవిత కథలు, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ జీవితకథలు కూడా చాలా వచ్చాయి. ధోని బయోపిక్ తో సుశాంత్ సింగర్ రాజ్ పుత్ ఎంత పెద్ద విజయం సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా రాబోతోంది. అలాగే సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ఇప్పుడు సినిమాగా రానుంది. సౌరవ్ గంగూలీ బయోపిక్ లో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో చేస్తున్నాడని తెలుస్తోంది. క్రికెట్ హిస్టరీలో సౌరవ్ గంగూలీ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు బయోపిక్ లో ఆ కథను చూపించనున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరో మరెవరో కాదు బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఆయుష్మాన్ ఖురానా ఏ పాత్ర ఇచ్చినా దానికి జీవం పోస్తాడు. ఇప్పటికే ‘డ్రీమ్ గర్ల్’, ‘బాలా’ వంటి చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి పాపులర్ అయ్యాడు. దాంతో అతన్ని వెతుక్కుంటూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది సౌరవ్ గంగూలీ బయోపిక్ . చాలా కాలం క్రితం ఈ వార్త విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ బయోపిక్‌లో సౌరవ్ గంగూలీ పాత్రను ఆయుష్మాన్ ఖురానా పోషించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఆయుష్మాన్ ఖురానా తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తున్నారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్‌కి దర్శకుడు లవ్ రంజన్ యాక్షన్-కట్ చెప్పనున్నారు. ఈ మేరకు 2021 నుండి ఆయుష్మాన్ ఖురానాతో చర్చలు జరిగాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 చివరిలో ఈ సినిమా షూటింగ్‌లో ఆయుష్మాన్ ఖురానా పాల్గొంటారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఓ సమస్య వచ్చింది. సౌరవ్ గంగూలీ బయోపిక్ నుంచి ఆయుష్మాన్ ఖురానా తప్పుకున్నాడు. అలాగే బాలీవుడ్‌లో బయోపిక్‌లు ఎక్కువ అవుతున్నాయని కాబట్టి తగ్గిస్తే మంచిదని ఆయుష్మాన్ నిర్ణయించుకున్నాడట. దాంతో చిత్ర బృందం షాక్ అయ్యింది. ఇప్పుడు కొత్త నటీనటులను వెతికే పనిలో పడ్డారట. సౌరవ్ గంగూలీ పాత్రకు ఏ కొత్త నటుడిని ఎంపిక చేస్తారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.