Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..

గ్యాంగ్‌స్టర్ల గన్ కల్చర్ బాలీవుడ్‌ను మరోసారి వణికిస్తోంది. నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు..ఆ వెంటనే సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. అసలు టైగర్ ష్రాఫ్‌పై ఎందుకు గురిపెట్టారు..? ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న అనిల్ పండిట్ ఎవరు..? కాల్పుల కేసులో ముగ్గురు నిందితుల అరెస్టుతో వెలుగులోకి వస్తున్న కీలక అంశాలేంటి..?

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..
Tiger Shroff Firing Incident

Updated on: Oct 19, 2026 | 8:44 PM

ఒకప్పుడు అండర్‌వరల్డ్ బెదిరింపులతో వణికిన బాలీవుడ్‌ను.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ల కాల్పులు, కిడ్నాప్ బెదిరింపులు కలవరపెడుతున్నాయి. లేటెస్ట్‌గా నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన..బాలీవుడ్‌లో మరోసారి భయాందోళనలు రేపింది. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తర్వాత.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న అనిల్ పండిట్ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసినవారిని వదిలిపెట్టబోమంటూ అతడి పేరుతో పోస్ట్ అయిన సోషల్ మీడియా పోస్టులు, ఆడియో క్లిప్‌లు కలకలం రేపుతున్నాయి.

హర్యానాకు చెందిన అనిల్ పండిట్‌

హర్యానాకు చెందిన అనిల్ పండిట్‌.. సంపత్ నెహ్రాతో పరిచయం ద్వారా లారెన్స్ బిష్ణోయ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. విదేశాల్లో ఉంటూ భారత్‌లో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.తన నేరాలకు కొత్తవారిని, ముఖ్యంగా మైనర్లను ఉపయోగించుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు కోటా ఎస్పీ ప్రకటించారు. నిందితుల్లో మైనర్‌ కూడా ఉన్నట్టు చెప్పారు.

తనను ఎందుకు టార్గెట్‌ చేశారో అర్థం కావడం లేదన్న టైగర్‌ ష్రాఫ్‌

మరోవైపు తనను ఎందుకు టార్గెట్‌ చేశారో అర్థం కావడం లేదన్నారు టైగర్‌ ష్రాఫ్‌. గతంలో తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని, ఎవరితోనూ శత్రుత్వం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌తో టైగర్‌ ష్రాఫ్‌ చెప్పారు. అలాగే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌, నటుడు సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. టైగర్‌ ష్రాఫ్‌ను పరామర్శించిన ఏక్‌నాథ్‌ శిండే..ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనతో బాలీవుడ్‌లో మరో అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం దగ్గర భద్రతను పెంచారు.

2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు

గత కొన్నేళ్లుగా బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడిన బెదిరింపులు, దాడుల ఘటనలు బాలీవుడ్‌ను కలవరపెడుతున్నాయి. 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు, అదే ఏడాది అక్టోబర్‌లో బాబా సిద్ధిఖీ హత్య, కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్‌పై కాల్పుల ఘటన, 2026లో దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల కాల్పులు, నటుడు రణవీర్ సింగ్‌కు బెదిరింపులు, మునవర్ ఫరూఖీకి హెచ్చరికలు..ఇప్పుడు లేటెస్ట్‌గా టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన. ఇలా ఒక్కో ఘటనతో బాలీవుడ్ ప్రముులు వణికిపోతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us