Ranveer Singh: హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. ఫ్యాన్స్‌లో ఆందోళన

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కు బెదిరింపులు. వాట్సాప్ ద్వారా రణవీర్ సింగ్ కు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇటీవలే దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.. గతంలో సల్మాన్ ఖాన్ కు కూడా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే..

Ranveer Singh: హీరో రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
Ranveer Singh

Updated on: Feb 11, 2026 | 7:35 AM

బాలీవుడ్ నటుడు నటుడు రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయని పోలీసులు మంగళవారం తెలిపారు. వాయిస్ నోట్ ద్వారా బెదిరింపులు రావడంతో ఆయన ఇంటి చుట్టూ భద్రత పెంచినట్లు  పోలీస్ అధికారులు తెలిపారు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం పై కాలపు జరిగిన విషయం తెలిసిందే.. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రణవీర్ కు బెదిరింపులు రావడంతో బాలీవుడ్ లో ఆందోళన నెలకొంది.

ఇటీవలే దురంధర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు రణవీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పాకిస్థాన్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ క్రమంలో రణవీర్ సింగ్ కు బెదిరింపులు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us