AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dino Morea: సినిమా ఇండస్ట్రీలో కలకలం.. ‘ఏజెంట్’ మూవీ నటుడు అరెస్ట్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు డినో మోరియాను ముంబై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అరెస్టు చేసింది. సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అనంతరం నటుడిని అదుపులోకి తీసుకుంది. ఈ స్టార్ నటుడి అరెస్ట్ బాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపుతోంది.

Dino Morea: సినిమా ఇండస్ట్రీలో కలకలం.. 'ఏజెంట్' మూవీ నటుడు అరెస్ట్.. ఏం జరిగిందంటే?
Dino Morea
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 3:35 PM

Share

బాలీవుడ్ నటుడు, మోడల్ అయిన డినో మోరియాను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు విచారించిన అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని మిథీ నది డ్రెడ్జింగ్ ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపణలు ఉన్న బహుళ కోట్ల కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన డినో మోరియా ఆకస్మిక అరెస్టు, చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన మిథీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు సంబంధించినది. నది నుంచి పూడికతీత కాంట్రాక్టు కేటాయింపులో పలు అవకతవకలు జరిగాయని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. అధికారులు, మధ్యవర్తులు కుమ్మక్కై టెండర్ ప్రక్రియను తారుమారు చేసినట్లు వెల్లడైంది. నది నుంచి తొలగించిన పూడిక పరిమాణాన్ని తప్పుగా పెంచి చూపించడం ద్వారా ఈ అవకతవకలు జరిగాయి. ఈ కుంభకోణం వల్ల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 65.54 కోట్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు సమర్పించిన నకిలీ పత్రాలపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. ప్రాజెక్ట్ నిధుల దుర్వినియోగం, అక్రమ చెల్లింపులపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థ యోచిస్తోంది. అయితే, ఈ కుంభకోణానికి, బాలీవుడ్ నటుడు డినో మోరియాకు మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.

దర్యాప్తులో భాగంగా, ఈ కేసులోని ప్రధాన నిందితుడితో ఆ నటుడు నిరంతరం ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలింది. ఈ కేసులోని నిందితుడైన కేతన్ కదమ్‌తో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. రూ. 14 లక్షల నుంచి 18 లక్షల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. డినో మోరియా అరెస్టు వార్త సోషల్ మీడియాలో, సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపింది. అంతకుముందు, ఈడీ అధికారులు నటుడి నివాసంపై దాడి చేసి సోదాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం నటుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇంకా కీలక విషయాలు బయటకు రావాల్సి ఉంది.

కాగా హిందీలో పలు హిట్ సినిమాల్లో హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా నటించాడు డినో మోరియా. ఇక తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ నటుడు పరిచయమే. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డ తెరకెక్కించిన ‘ఏజెంట్ ‘ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. అలాగే పలు కన్నడ, తమిళ, మలయాళం సినిమాల్లోనూ నటించాడు డినో మోరియా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇండస్ట్రీలో కలకలం.. 'ఏజెంట్' మూవీ నటుడు అరెస్ట్.. ఏం జరిగిందంటే?
ఇండస్ట్రీలో కలకలం.. 'ఏజెంట్' మూవీ నటుడు అరెస్ట్.. ఏం జరిగిందంటే?
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!