Bigg Boss Telugu 10: రెండు రోజులకే 15 లక్షలు.. కానీ మిథిలేష్‌కు చివరకు మిగిలేది ఎంతో తెలుసా? అంత కోతనా?
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మిథిలేష్ రెడ్డి కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో మిథిలేష్ ను చూస్తుంటే గత సీజన్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ గుర్తుకు వచ్చాడంటున్నారు బిగ్ బాస్ ఆడియెన్స్.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి వారం ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారం ప్రముఖ నటుడు కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఇప్పుడు నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని, ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు రానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతవారం ముగ్గురు కామనర్స్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో భల్లాలదేవగా గుర్తింపు పొందిన మిథిలేష్ రెడ్డి హౌస్ లోకి వెళ్లిన రెండు రోజులకే 15 లక్షల రూపాయల సూట్ కేస్ తో బయటకు వచ్చాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి. కేవలం రెండు రోజుల్లోనే హౌస్ లో ఉన్న మిథిలేష్ రూ.15 లక్షలతో బయటకు రావడంపై అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100 రోజులపాటు హౌస్ లో ఉన్నప్పటికీ వచ్చే ప్రైజ్ మనీ కంటే కూడా రెండు రోజులకి ఈ 15 లక్షల రూపాయలే ఎక్కువ అంటూ చాలామంది మిథిలేష్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేవలం డబ్బుల కోసమే బిగ్ బాస్ లోకి వెళ్లావా? అంటూ మిథిలేష్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
మరోవైపు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో అచ్చం డెమోన్ పవన్ స్ట్రాటజీనే ఫాలో అయ్యావా? అన్న ప్రశ్నకు మిథిలేష్ ఇలా ఆన్సరిచ్చాడు. ‘ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందుగా పవన్ అన్నను కలిసిన మాట నిజమే. కానీ ఆయన మాత్రం హౌస్ లో చివరి వరకు ఉండేలాగే ట్రై చేయి అద్భుతంగా ఆడు అని సలహా ఇచ్చారు. కానీ ఇలా డబ్బులు తీసుకుని బయటికిరా అని మాత్రం చెప్పలేదు. ఇది పూర్తిగా నా నిర్ణయమే’ అంటూ మిథిలేష్ చెప్పుకొచ్చాడు.
కాగా బిగ్ బాస్ షోలో తనకు 15 లక్షల రూపాయలు వచ్చినప్పటికీ కటింగ్స్, ట్యాక్స్ లు పోను మిగిలేది కేవలం 10 లక్షలు మాత్రమేనని మిథిలేష్ చెప్పుకొచ్చాడు. ‘నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిందే గుర్తింపు కోసమే. అయితే రెండు రోజులకే నాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. అందుకే 15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చాను’ అని మిథిలేష్ చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




