ప్రజంట్ మస్ట్ ట్రెండింగ్‌లో ఉంది పాప అషు రెడ్డి. ఇటీవల డేంజరస్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా అషు రెడ్డితో డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఇంటర్వ్యూలో అషు రెడ్డి పాదాల వద్ద కూర్చుని ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక అందాల ఆరబోతకు హద్దులు లేవంటూ ఆమె తన డ్రెస్సింగ్‌తోనే చెప్పేస్తుంది. తొలుత జూనియర్ సమంతగా వీడియోలతో నెట్టింట వైరలైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్‌లో చాన్స్ దక్కించుకుని మరింత పాపులర్ అయ్యింది. తాజాగా అషు హీరోయిన్ చాన్స్ పట్టేసింది. ‘ఎ మాస్టర్ పీస్’ అనే మూవీలో కథానాయకి చాన్స్ వచ్చినట్లు తనే సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
సైన్స్ ఫిక్షన్‌తో కూడిన థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆద్య పాత్రని పోషించబోతుందట అషు. సుకు పూర్వాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈయన గతంలో శుక్ర, మాటరాని మౌనమిది మూవీస్ డైరెక్ట్ చేశాడు. కండ్రగుల శ్రీకాంత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సూపర్ పవర్స్ ఉన్న కథానాకుడిగా ఈ మూవీలో అరవింద్ కృష్ణ కనిపించబోతున్నట్లు పోస్టర్‌ని ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
మొత్తానికి అషు పాప చాన్నాళ్లకి హీరోయిన్ చాన్స్ పట్టేసింది. సోషల్ మీడియాలో వీడియోలలో, ఇంటర్వ్యూలలో తన అందాలతో రచ్చ చేసే ఈ చిన్నది.. ఇక సినిమాలో ఏ మేరకు గ్లామర్ ఒలకబోస్తుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.