Bigg Boss 9 Telugu : వామ్మో తనూజ.. ఏంటమ్మా ఆ మాటలు.. డీమాన్ హెల్త్ పై అలాంటి డైలాగ్స్.. నెటిజన్స్ ట్రోల్స్..

బిగ్ బాస్ సీజన్ 9.. ముందు నుంచి టైటిల్ రేసులో దూసుకుపోతున్న కంటెస్టెంట్ తనూజ. ఇప్పటికీ ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది. అయితే ఆమెకు బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నారన్నది ముందు నుంచి వినిపిస్తున్న మాట. తనూజకు పాజిటివ్ ఓటింగ్ ఉన్నప్పటికీ నెట్టింట మాత్రం అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

Bigg Boss 9 Telugu : వామ్మో తనూజ.. ఏంటమ్మా ఆ మాటలు.. డీమాన్ హెల్త్ పై అలాంటి డైలాగ్స్.. నెటిజన్స్ ట్రోల్స్..
Thanuja, Pawan

Updated on: Dec 06, 2025 | 7:15 AM

బిగ్ బాస్ సీజన్ 9.. ముగింపు దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోసీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. మరోవైపు గత వారం రోజులుగా హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం తెగ పోటీపడుతున్నారు. వరుసగా రసవత్తరంగా జరుగుతున్న టాస్కులలో విన్నర్ గా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్ పడాల. ఇదంతా పక్కన పెడితే.. ఈ సీజన్ టైటిల్ రేసులో ముందున్నది తనూజ. కానీ ఇప్పుడు తనూజ టార్గెట్ డీమాన్ వైపు తిప్పింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండైరెక్ట్‌గా డీమాన్ మీద తనూజ స్ట్రాటజీలు వేస్తుంది. ఇతర కంటెస్టెంట్స్ దగ్గర డీమాన్ గురించి మాట్లాడుతుంది. అలాగే అతడు ఏం చేసినా తప్పే అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అయితే ఇప్పుడు డీమాన్ హెల్త్ గురించి తనూజ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

కొన్నాళ్లుగా హౌస్ లో డీమాన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించినవీడియో నెట్టింట వైరలవుతుంది. డీమాన్ పవన్ మెడికల్ రూంకు వెళ్తుంటే తనూజ మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన వీడియో ఇది. అందులోడాక్టర్ కు చెప్పు పెద్ద సూది ఏమైనా ఉంటే గుచ్చేసి పంపమని. ఇక 3 వారాలు పైకి లేవకూడదు అలా చెప్పుఅంటూ తనూజ అరుస్తుంది. ఇప్పుడువీడియోను షేర్ చేస్తూ తనూజ మీద ఫైర్ అవుతున్నారు డీమాన్ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

కంటెస్టెంట్ మీద ఎంత కోపం ఉంటే ఇలా అతడి ఆరోగ్యంపై కామెంట్స్ చేస్తారా..? మూడు వారాలు లేవకుండా ఉంటే నువ్వు కప్పు విన్ అవ్వాలనా.. ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు తనూజ ఫ్యాన్స్ సైతం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కేవలం కామెడీగానే మాట్లాడిందంటూ రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..