ఇన్ స్టాగ్రామ్ నుంచి సీరియల్స్‌లోకి.. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హోస్‌లోకి..! దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. సీజన్  10 ప్రారంభం అయ్యింది. ఈ సీజన్  మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది.

ఇన్ స్టాగ్రామ్ నుంచి సీరియల్స్‌లోకి.. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హోస్‌లోకి..! దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
Debjani Modak

Updated on: Sep 06, 2026 | 7:37 PM

బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ మొదలైపోయింది. బిగ్ బాస్ గేమ్ షో 10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లానే ఇప్పుడు పైసా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కొంతమంది కామనర్స్ ను హౌస్ లోకి పంపనున్నారు. అయితే సామాన్యులకు గట్టి పోటీ ఇచ్చేలా ఈసారి సెలబ్రెటీలలో కూడా క్రేజ్ ఉన్న క్యాండిడేట్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సీజన్ 10లోకి తొలి ఎంట్రీ ఇచ్చింది సీరియల్ భామ దేబ్జానీ మోదక్…

‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ సీరియల్స్ చూసేవారికి ఈ బ్యూటీ దేబ్జానీ తెలుసు… ఈ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బెంగాలీ బ్యూటీ ఇప్పుడు బిగ్‌ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. అంతే కాదు వారానికి రూ. 4 లక్షల రెమ్యునరేషన్ తో హౌస్ లో దేబ్జానీ ఎంట్రీ ఇచ్చిందని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఈ మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

1996 మార్చి 20న పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జన్మించింది. ఇంట్లో అందరూ ప్రేమగా “కిన్ని” అని పిలుస్తారట. ప్లస్ 2 చదువుకునే సమయంలోనే మోడలింగ్, నటనలో ఆఫర్లు రావడంతో కరస్పాండెన్స్ ద్వారా తన చదువును పూర్తి చేసింది. ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి 2013లో నాకౌట్ అనే బెంగాలీ సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us