Bhumika Chawla: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..

|

Dec 29, 2022 | 8:08 PM

ఈ సినిమాతో పవన్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో పవన్ నటన, యాటిట్యూడ్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇక హీరోయిన్ గా భూమిక అందంతో నటనతో ఆకట్టుకుంది.

Bhumika Chawla: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..
Kushi
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఖుషి సినిమా ఒకటి. ఎస్.జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పవన్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో పవన్ నటన, యాటిట్యూడ్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇక హీరోయిన్ గా భూమిక అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. న్యూ ఇయర్ పురస్కరించుకొని ఖుషి సినిమాను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే లేటెస్ట్ ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాను మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ అంతా రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రీరిలీజ్ పై హీరోయిన్ భూమిక స్పందించింది.

ప్రస్తుతం భూమిక విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆమె ఓ వీడియోలో ఈ సినిమా గురించి మాట్లాడారు. ఖుషి సినిమా రీరిలీజ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనకు ఖుషి సినిమాలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు ఎస్జే సూర్య, హీరో పవన్ కళ్యాణ్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ న్యూ ఇయర్ ను సంతోషంగా గడపండి అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం భూమిక సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్క, వదిన పాత్రలు చేస్తూ అలరిస్తోంది భూమిక. భూమిక గతంలో ఒక్కడు సినిమా రీరిలీజ్ సమయంలోనూ థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.