Nani : లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?

న్యాచుర్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా నాని నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Nani : లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. నాని జోడిగా క్రేజీ బ్యూటీ.. సుజీత్ మూవీలో ఆఫర్.. ?
Nani, Sujeeth Movie

Updated on: Aug 08, 2026 | 6:31 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా తర్వాత నాని సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఓజీ లాంటి భారీ హిట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సుజిత్.. ఇప్పుడు నానితో సినిమా చేస్తుండడంతో అప్పుడే మంచి క్యూరియాసిటీ నెలకొంది. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి బ్లడీ రోమియో అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇందులో నాని జోడిగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్య శ్రీ భోర్సే కథానాయికగా నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఇక ఈ సినిమా కత తనకు నచ్చడంతో భాగ్య శ్రీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇటీవలే అక్కినేని అఖిల్ జోడిగా లెనిన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన రానుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి నుంచి వరుస పరాజయాలను అందుకుంటుంది. అయినప్పటికీ తన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే లెనిన్ సినిమాతో సక్సె్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు రాత్రికి రాత్రే మారుమోగింది. ఇక ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మరీ ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

భాగ్యశ్రీ బోర్సే..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Loading...
Unable to load recommendations.
Follow Us