Bandla Ganesh: ఆయనే లేకపోతే అప్పుడే చనిపోయేవాడిని.. బండ్ల గణేష్ ఎమోషనల్

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత ప్రొడ్యూసర్‌గా ఎదిగారు బండ్ల గణేష్. ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించిన బండ్ల ఆతర్వాత నిర్మాత రవితేజ్‌తో..

Bandla Ganesh: ఆయనే లేకపోతే అప్పుడే చనిపోయేవాడిని.. బండ్ల గణేష్ ఎమోషనల్
Bandla Ganesh
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Aug 26, 2021 | 9:44 AM

Bandla Ganesh: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత ప్రొడ్యూసర్‌గా ఎదిగారు బండ్ల గణేష్. ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించిన బండ్ల ఆతర్వాత నిర్మాత రవితేజ్‌తో ఆంజనేయులు అనే సినిమా చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తో తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు చేశారు. వీటిలో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇద్దరమ్మాయిలతో, టెంపర్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత బండ్లగణేష్ రాజకీయ ప్రవేశం చేశారు. రాజకీయాల్లోనూ తనదైన శైలిలో అధికార పక్షనాయకులపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు బండ్ల. ఆ తర్వాత రాజకీయాలు తనకు సరిపడవని గ్రహించి తిరిగి సినిమాల్లోకి వచేశారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్నపాత్రలో కనిపించి నవ్వించారు బండ్ల గణేష్. ఇక ఇప్పుడు మరోసారి నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బండ్ల.

ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ఈ మధ్య కరోనా మహమ్మారితో బాధపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే ఆ సమయంలో జరిగిన విషయాల గురించి బండ్ల మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం తనకు రెండోసారి కరోనా సోకిందని గణేశ్ తెలిపారు. ఆ సమయంలో తన భార్య, బిడ్డతో పాటు ఇంటిల్లిపాదీ కరోనాతో బాధపడ్డామని చెప్పారు. తన ఊపిరితిత్తులు 60 శాతానికి పైగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయని తెలిపారు.పెద్ద పెద్ద ఆసుపత్రులన్నింటికీ ఫోన్ చేశా. ఎవరూ బెడ్స్ లేవన్నారు. అపోలో ఆసుపత్రికి చేస్తే ‘సారీ’ అని చెప్పారన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేద్దామంటే అప్పుడు ఆయన కూడా కరోనా భారిన పడ్డారు. దాంతో చివరిగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు గణేష్ అన్నారు. అప్పుడు నా సమస్య చెప్పుకున్నా..చిరంజీవి కాసేపు మాట్లాడలేకపోయారని… ఫోన్ పెట్టేశారని తెలిపారు. అయితే ఆయన తన పని తాను చేశారని… తనకు హాస్పిటల్లో‌‌‌ బెడ్ దొరికిందని… కొన్ని రోజుల పాటు చికిత్స పొంది ఆరోగ్యంగా బయటపడ్డానని చెప్పారు. హాస్పిటల్‌లో చేరడం ఒక్క రోజు లేట్ అయినా ప్రాణం పోయేదని తనతో డాక్టర్లు చెప్పారని… ఈ రోజు తాను బతికుండటానికి చిరంజీవి గారే కారణమని ఎమోషనల్ అయ్యారు బండ్ల. ఇదంతా చిరంజీవిగారి చలవే! నాకు ప్రాణం పోసిన ఆయన రుణం తీర్చుకోలేనిది’’అని అన్నారు బండ్ల గణేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu