AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dada Dhamaka Song: తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ అదరగొట్టాడు

నందమూరి బాలకృష్ణ సుమారు తొమ్మిదేళ్ల తర్వాత గొంతు సవరించుకున్నారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న 'దాదా' సినిమాలో మళ్లీ పాట పాడారు బాలయ్య. ‘దాదా ధమాకా' అంటే ఈ హుషారెత్తించే సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్

Dada Dhamaka Song: తొమ్మిదేళ్ల తర్వాత బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ అదరగొట్టాడు
Balakrishna Dada Dhamaka Song
Basha Shek
|

Updated on: Nov 13, 2026 | 8:35 PM

Share

‘అఖండ 2’ తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ‘దాదా’. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మంచు మనోజ్ మళ్లీ విలన్ గా చేస్తున్నాడు. వీరితో పాటు సంజయ్ దత్, సముద్రఖని, శరత్ కుమార్ తదితర స్టార్ నటులు ఈ సినిమాలో వివిధ పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా దాదా సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ‘షెహరంతా అదిరిపోనీ… నిదరంత చెదిరిపోనీ… జామురాతిరి జాగరం చెయ్యనీ పరువాన్నీ… దాదా ధమాకా’ అంటూ సాగే ఈ పాటలో బాలయ్యతో కలిసి బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి స్టెప్పులేసింది. మ్యూజిక్ లెజెండ్ తమన్ ఎప్పటిలాగే అదరగొట్టాడు. బీజీఎం, బాలయ్య- నర్గీస్ ల ఎనర్జిటిక్ స్టెప్పులు సాంగ్ లో హైలెట్ గా నిలిచాయి. అన్నిటికీ మించి బాలయ్య వాయిస్ ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆయనతో పాటు లేడీ సింగర్ రజనీ శ్రీ పూర్ణిమ ఈ పాటను పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ సమకూర్చిన మాస్ స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కాగా చివరిగా 2017లో రిలీజైన పైసా వసూల్ సినిమాలో పాట పాడారు బాలయ్య. మళ్లీ ఇన్నేళ్లకు దాదా సినిమాలో తన గొంతు వినిపించారు. ఇక బాలయ్య- తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 సినిమాల్లోని పాటలు, బీజీఎమ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దాదా సినిమాకు కూడా అద్దిరిపోయే పాటలు, బీజీఎమ్ అందిస్తున్నట్లు తమన్ ఇటీవలే చెప్పుకొచ్చారు. ఇక వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని- బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న దాదా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌తో పాటు అండర్ వరల్డ్ మాఫియా, గ్యాంగ్ స్టర్ వార్స్, బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

దాదా ధమకా సాంగ్ లిరికల్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో