
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. పవన్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ వరుసగా పోస్టులు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అన్నా లెజినోవా సోషల్ మీడియా ఖాతాకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తాజాగా పవన్ భార్య అన్నా లెజినోవా నెట్టింట అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు.. పవన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే మీకు వంట చేయడం వచ్చా అని ఓ నెటిజన్ అడగ్గా.. మా అత్తమ్మ నుంచి నేను వంటలు నేర్చుకున్నాను. దోస, ఇడ్లీ, చట్నీ, కర్రీలు, పప్పులు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్స్ ఇగురు, బిర్యానీ.. ఇంకా చాలా నేర్చుకున్నాను. వెజ్ వంటలు ఎక్కువగా నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..
అనంతరం మరో నెటిజన్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టం అని అడగ్గా.. మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను అది వండడం ఆమె నుంచి నేర్చుకున్నాను. అలాగే ఆయన వదినమ్మ (సురేఖ) చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని తెలిపింది. అలాగే అభిమానులు అడిగిన మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ప్రస్తుతం అన్నా లెజినోవా పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..
Pawan Kalyan
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..