Allu Arjun: మాస్ యాక్షన్‏ ఎంటర్‏టైనర్‏గా రానున్న బన్నీ.. బోయపాటి డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా ?

| Edited By: Rajitha Chanti

Jul 13, 2021 | 5:43 PM

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్‏గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Allu Arjun: మాస్ యాక్షన్‏ ఎంటర్‏టైనర్‏గా రానున్న బన్నీ.. బోయపాటి డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా ?
Allu Arjun
Follow us on

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్‏గా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుకున్నట్టుగానే పుష్ప సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకనిర్మాతలు. ఈ మూవీని తెలుగుతోపాటు.. మరో ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అన్ని పాన్ ఇండియా సినిమాలనే చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే బన్నీ.. పుష్ప తర్వతా.. తమిళ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్, కొరటాల శివ.. ప్రశాంత్ నీల్ వంటి పాన్ ఇండియా డైరెక్టర్స్‏తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “పుష్ప” మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. 2022 ప్రారంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక పుష్ప మొదటి పార్ట్ తర్వాత రెండవ పార్ట్ చేయనున్నాడా ? లేదా మరో ప్రాజెక్ట్‏ను పట్టాలెక్కించనున్నాడా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. “పుష్ప” తర్వాత అల్లు అర్జున్… మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో బన్నీ – బోయపాటి కాంబోలో వచ్చిన “సరైనోడు” సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. స్టైలిష్ స్టార్ లోని మాస్ యాంగిల్ ని కంప్లీట్ గా బయట పెట్టింది. అందుకే వీరి కలయికలో మళ్ళీ ఓ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోసారి వీరిద్దరి కలయికలో రాబోయే సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడని టాక్. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ.. వరుసగా.. ప్రశాంత్ నీల్, కొరటాల శివ డైరెక్షన్లో సినిమాలు చేయబోతున్నాడని సమాచారం. వీటితోపాటు.. తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ చిత్రం కూడా సెట్స్ పైకి వెళ్లనుందట. త్వరలోనే బన్నీ తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Also Read: Boycott Pavitra Rishta 2: సుశాంత్ సింగ్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము.. ఆ సీరియల్‏ను వెంటనే ఆపేయండి.. నెట్టింట్లో సుశాంత్ ఫ్యాన్స్..

అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె రూపం.. మాస్క్ పెట్టుకుని ఫోజిచ్చిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..