Samantha- Alia Bhatt: ‘ఊ అంటావా ఊఊ అంటావా’.. మళ్లీ తెలుగులో పాట పాడిన అలియా.. సామ్ రియాక్షన్ చూశారా? వీడియో

|

Oct 09, 2024 | 1:17 PM

బాలీవుడ్ అందాల తార అలియా భట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అందం, అభినయం పరంగా బోలెడు అభిమానులను సంపాదించుకుంది.

Samantha- Alia Bhatt: ఊ అంటావా ఊఊ అంటావా.. మళ్లీ తెలుగులో పాట పాడిన అలియా.. సామ్ రియాక్షన్ చూశారా? వీడియో
Alia Bhatt, Samantha
Follow us on

బాలీవుడ్ అందాల తార అలియా భట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అందం, అభినయం పరంగా బోలెడు అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం మన దేశంలో బాగా డిమాండ్ ఉన్న హీరోయన్లలో అలియా కూడా ఒకరు. అలాగే భారీ పారితోషకం తీసుకుంటోన్న నటీమణుల్లో ఈ బ్యూటీ ముందుంటుంది. ఇక అలియా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా నటించి అందరి మన్ననలు అందుకుందీ అందాల తార. కాగా రణ్ బీర్ తో పెళ్లి, పిల్లల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అలియా భట్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా చిత్రం జిగ్రా. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ కు వచ్చేసింది అలియా. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఈవెంట్ లో సందడి చేసింది. అలియాతో పాటు సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్, దగ్గుబాటి రానా ఇలా పలువురు సినీ ప్రముఖులు జిగ్రా ఈవెంట్ లో సందడి చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల సింగర్ గానూ సత్తా చాటుతోంది అలియా భట్. ఇటీవల దేవర మూవీ ప్రమోషన్లలోనూ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన టాక్ లో పాల్గొన్న అలియా.. అక్కడ చుట్టమల్లే పాట పాడింది. అలియా పాట విని వావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. తాజాగా మరోసారి తన గొంతు వినిపించిందీ అందాల తార. జిగ్రా ఈవెంట్ లో హైదరాబాద్ కు వచ్చిన అలియా.. పుష్ప 1 మూవీలోని ఊ అంటావా ఊ అంటావా పాట పాడింది. అది కూడా తెలుగులో. సిగ్గు పడుతూనే పాటను ఆలపించిన అలియాను చూసి పక్కనే కూర్చున్న సమంత పెద్దగా నవ్వుతూ ఆమెను హగ్ చేసుకుంది. అలియా సింగింగ్ ట్యాలెంట్ ను చూసి యాంకర్ సుమ, హీరో రానా అదిరిపోయిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం అలియా పాటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.