Tamannaah Bhatia: అబద్ధాలతో జీవించలేను.. అతనికి చాలా ఇచ్చాను.. తమన్నా బ్రేకప్ స్టోరీ

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.

Tamannaah Bhatia: అబద్ధాలతో జీవించలేను.. అతనికి చాలా ఇచ్చాను.. తమన్నా బ్రేకప్ స్టోరీ
Tamanna Bhatia

Updated on: Jan 23, 2025 | 8:17 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి

తాజాగా తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవ‌ల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందో. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ అమ్మడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. ఇదిలా ఉంటే తమన్నాకు ఇంతకు ముందు ఓ సారి హార్ట్ బ్రేక్ అయ్యిందట. దాని నుంచి ఆమె చాలా పాఠాలు నేర్చుకున్నా అని తెలిపింది.

ఇది కూడా చదవండి : Honey Rose: అలాంటివారిని కఠినంగా శిక్షించాలి.. హనీరోజ్‌కు కోపం వచ్చింది

తమన్నా మాట్లాడుతూ.. మీరు మీ భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించకూడదు. మీరు అనుకున్నంత పరిపూర్ణంగా వాళ్లు ఉండరు.  చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పేవారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. నేను అబద్దాలతో జీవించలేను అని తెలిపింది తమన్నా అలాగే ముందు మీ ప్రియురాలి సమస్యలు వినండి. చాలా సమయం వారు పరిష్కారం ఆశించి మీతో మాట్లాడరు. సమస్య పరిష్కారం కావడం వారికి ముఖ్యం కాదు. మీరు ఆమె సమస్యలను, ఆమె ఆకాంక్షలను వినడం ముఖ్యం. మీరు ఎంత ముఖ్యమో ఆమె గ్రహించేలా చూసుకోండి’ అని తమన్నా చెప్పింది. అలాగే తన హార్ట్ బ్రేక్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేను. అతను (ఎక్స్ బాయ్ ఫ్రెండ్) అంగీకరించే స్థితిలో ఉన్నాడా లేదా అని ఆలోచించకుండా నేను అతనికి ప్రతిదీ ఇచ్చాను. ఇది కరెక్ట్ కాదు. ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవడం వల్ల బంధం బలపడుతుంది అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us