ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ శ్రుతి హాసన్. క్రాక్ సినిమా తర్వాత శ్రుతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం శ్రుతి హాసన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాలోని తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా… నెట్టింట మాత్రం శ్రుతి చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఫోటోస్.. సాంగ్స్ వీడియోస్ అంటూ అభిమానులను పలకరిస్తుంటుంది. అలాగే తన ప్రియుడు శాంతాను హజరికాకు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. కానీ నెటిజన్స్ మాత్రం తిక్క ప్రశ్నలతో శ్రుతిని విసిగించగా.. వారికి తనస్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చింది.
తాజాగా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో అలా వెయిట్ చేస్తున్నానని.. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండని ఇన్ స్టా అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్.. నువ్వు మాకు కావాలి ఆంటీ అంటూ అడిగేశాడు. దీంతో శ్రుతి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. నేను షూటింగ్స్ అంటూ అటు ఇటూ తిరుగుతూ చాలా బిజీగా ఉన్నాను. ఉదయం తిన్నది కూడా సరిగ్గా అరగడం లేదు. అందరూ యూత్ అంతా కూడా మీరు ఇంత బిజీగా ఎలా ఉంటున్నారు ఆంటీ అని అడుగుతుంటారు. ఏం చేయను నేను అలా బిజీగా ఉండిపోతున్నాను అంటూ చాలా సరదాగానే మాట్లాడుతూ రివర్స్ పంచ్ వేసింది.
అలాగే పెళ్లి ఎప్పుడూ అంటూ మరో నెటిజన్ అడగ్గా.. ఈ ప్రశ్నకు తనకు చాలా బోరింగ్ అంటూ సైడ్ చేసేసింది. కానీ మ్యారెజ్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్నాళ్లుగా శంతను హజరికాతో శ్రుతి హాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.