గంగోత్రి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య.. తిరువీర్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మసూద (Masooda). ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత (Sangeetha) కీలకపాత్రలో నటిస్తున్నారు. హారర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా వీరు ముగ్గురు అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కెరీర్లో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తల్లిగా నటించడం వల్ల ప్లస్ అయ్యిందా ?.. మైనస్ అయ్యిందా ? అని సంగీతను అడగ్గా.. తనకు రెండు అని చెప్పుకొచ్చారు.
ఓ హోటల్లో ఉన్నప్పుడు అనిల్ వచ్చి తదుపరి రోజు సీన్ చెప్పాడని.. అయితే ఎప్పుడు అనిల్ ను చూసినా.. ఏయ్ ఇలా చేశావు రా నన్ను అని తిట్టుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. నీకు వచ్చిన అవకాశాలు.. అరే ఇది నేను ఎందుకు వదులుకున్నాను అని అనుకున్న సినిమా ఏదైనా ఉందా ? అని అడగ్గా.. తాను రెండు రోజుల షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తొలగించారని చెప్పారు సంగీత. అలాగే 12 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని అన్నారు హీరోయిన్ కావ్య. తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ తన పక్కన హీరోయిన్ గా చేయాలని అడగ్గా.. నేను హీరోయిన్ అయ్యే సమయానికి మీరు ముసలివాళ్లు అయిపోతారని అన్నానని చెప్పింది కావ్య. ప్రస్తుతం వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.