AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని అడిగితే.. ఆమెను సెలక్ట్ చేశారు.. రెజీనా షాకింగ్ కామెంట్స్

రెజీనా కాసాండ్రా ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఈ ముద్దుగుమ్మ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. రెజీనా 2005లో తమిళ చిత్రం కండా నాల్ ముదల్లో సహాయ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

నాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వమని అడిగితే.. ఆమెను సెలక్ట్ చేశారు.. రెజీనా షాకింగ్ కామెంట్స్
Regina Cassandra
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 10:12 AM

Share

రెజీనా కాసాండ్రా.. ఈ అందాల భామ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెజీనా, 2005లో తమిళ చిత్రం “కండా నాల్ ముదల్”తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తెలుగులో “శివ మనసులో శృతి” (2012) ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు “సైమా ఉత్తమ తొలి చిత్ర నటి” అవార్డు కూడా వచ్చింది.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

రెజీనా తెలుగులో “రొటీన్ లవ్ స్టోరీ”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పవర్” వంటి సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తమిళంలో “కేడి బిల్లా కిల్లాడి రంగా”, “మానగరం” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు పొందింది.ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది. “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”లో సాంప్రదాయ అమ్మాయి, “జ్యో అచ్యుతానంద”లో స్టూడెంట్, “అ”లో డ్రగ్ అడిక్ట్ వంటి పాత్రల్లో తన సత్తా చాటింది.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

ఈ భామ బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. 2019లో “ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా” చిత్రంతో హిందీలో ప్రవేశించింది. తాజాగా విడుదలైన సన్నీ డియోల్ “జాట్” చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అలాగే, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది. తాజాగా రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్ లో వచ్చిన “అ” సినిమా స్క్రిప్ట్‌ చెప్పారు. నాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తే చేస్తా.. లేదా ఏదైనా కీలకమైన , నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇస్తే చేస్తా అని చెప్పిందట.. అయితే హీరోయిన్ గా ఇప్పటికే కాజల్ ను ఫిక్స్ చేశాం అని చెప్పారు. సరే మరో బలమైన పాత్ర ఇవ్వమని అడిగాను. లేదంటే సినిమా చేయను అని తెగేసి చెప్పా అని తేలింది. దాంతో మీరా అనే పాత్ర ఇచ్చినట్టు తెలిపింది రెజీనా. అలాగే రీసెంట్ గా వచ్చిన జాట్ సినిమాలోనూ పోలీస్ ఆఫిసర్ పాత్ర చేయమన్నారు. నాకు భారతి రోల్‌ ఇస్తేనే చేస్తానన్నాను అని చెప్పా దాంతో నాకు ఆ పాత్ర ఇచ్చారు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..