
ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు ఇటీవల హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. చాలా మంది హీరోలను మించి రెమ్యునరేషన్స్ అందుకుంటున్న భామలు ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఆ సినిమా వల్ల అందరూ లాభపడ్డారు కానీ తనకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె మరెవరో కాదు నోరా ఫతేహి. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా ఫతేహి. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ కూడా భారీగా ఉంటుంది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, బీ టౌన్ లో వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో జరిగిన చేదు అనుభవాలు పంచుకుంది. స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించినప్పటికీ తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. అలాగే తనకే తాను చేసిన స్పెషల్ సాంగ్స్ వల్ల సినిమాలు విజయంలోనూ కీలక పాత్ర పోషించాయని తెలిపింది.

నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను చేసిన స్పెషల్ సాంగ్స్ వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా భారీ హిట్ అయ్యాయి. సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. కానీ నిర్మాతలు నాకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. ఇలా ఎన్నో సినిమాలు నాకు ఉపయోగపడేలేదు. కానీ నేను స్టేజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం వల్లే నాకు డబ్బులు వచ్చాయి. స్టేజ్ పర్ఫామెన్స్ వల్లే నేను డబ్బులు సంపాదించా.. డబ్బు లేకుండా కేవలం పేరు మాత్రమే సొంతం చేసుకుంటే ఏం లాభం. ఇక పై ఎలాంటి లాభం లేకుండా పని చేయకూడదు అని నిర్ణయించుకున్నా చెప్పుకొచ్చింది. .