Mumaith Khan : ఆ స్టార్ హీరో మూవీ షూటింగ్‌‌‌‌లో గాయపడిన ముమైత్ ఖాన్… 15 రోజులపాటు కోమాలో ఉన్న హాట్ బ్యూటీ..

|

Feb 21, 2021 | 7:22 AM

ముమైత్ ఖాన్ ఈ  పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్ లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే

Mumaith Khan : ఆ స్టార్ హీరో మూవీ షూటింగ్‌‌‌‌లో గాయపడిన ముమైత్ ఖాన్... 15 రోజులపాటు కోమాలో ఉన్న హాట్ బ్యూటీ..
Follow us on

Mumaith Khan : ముమైత్ ఖాన్ ఈ  పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్ లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్ లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్ గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా  సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముమైత్  ఖాన్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను తెలిపింది.

తనకు స్టార్ డమ్ వచ్చాకా .. తనకు ఎలాంటి కొమ్ములు రాలేదని అంది ముమైత్. అలాగే ఆనందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా షూటింగ్ సమయంలో సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో జారిపడిపోయాను దాంతో తలకు తీవ్రగాయం అయ్యింది. ఆ సమయంలో 15 రోజులపాటు కోమాలోకి వెళ్ళాను. రెండు రోజులపాటునా తలనుంచి రక్తం కారుతూనే ఉంది. డాక్టర్స్ 3 ఏళ్ల వరకు రెస్ట్  తీసుకోమన్నాంరు. కానీ నేను మూడునెలలకే తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టాను. అంటూ ఎమోషనల్ అయ్యారు ముమైత్ ఖాన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi :భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ మూవీ .. మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన మక్కల్ సెల్వన్…