Mrunal Thakur: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్.. అయినా తగ్గని ఆఫర్స్..

ఇక తన నటనతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న మృణాల్‏కు టాలీవుడ్‏లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాక్. ఇప్పటికే పలువురు ప్రొడ్యూసర్స్ ఈ ముద్దుగుమ్మను సంప్రదించారట.

Mrunal Thakur: రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మృణాల్ ఠాకూర్.. అయినా తగ్గని ఆఫర్స్..
Mrunal Thakur

Updated on: Sep 20, 2022 | 3:25 PM

సీతామాహాలక్ష్మీగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా మృణాల్, దుల్కర్ సల్మాన్ సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇందులో ఒంటరి సైనికుడు లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. అలాగే.. సుమంత్ అక్కినేని, భూమిక, తరుణ్ భాస్కర్, రష్మిక మందన్నా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో కనిపించారు. ఇక తన నటనతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న మృణాల్‏కు టాలీవుడ్‏లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాక్. ఇప్పటికే పలువురు ప్రొడ్యూసర్స్ ఈ ముద్దుగుమ్మను సంప్రదించారట.

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్.. తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందట. అయితే ఎంత పారితోషికం పెంచింది అనేది మాత్రం క్లారిటీ లేదు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల నుంచి మృణాల్‏కు ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ మృణాల్‏ను కథానాయికగా ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్.. మృణాల్ జోడిగా మరో అందమైన ప్రేమకథను తీసుకురాబోతున్నట్లు ఇటీవల ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ తెలిపారు. మొత్తానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు దక్షిణాదిలో వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us