Pushpa: The Rule: బంపర్ ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్.. పుష్ప 2లో ఆ నటి కూడా..

పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.. అంటూ ఇప్పటికీ ప్రేక్షకులతో డైలాగులు చెప్పేస్తుంది పుష్ప సినిమా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా మరి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు.

Pushpa: The Rule: బంపర్ ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్.. పుష్ప 2లో ఆ నటి కూడా..
Pushpa
Follow us

|

Updated on: Mar 17, 2022 | 3:07 PM

Pushpa: The Rule: పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.. అంటూ ఇప్పటికీ ప్రేక్షకులతో డైలాగులు చెప్పేస్తుంది పుష్ప(Pushpa) సినిమా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప రాజ్ గా మరి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. పుష్ప మేనియా ఏకంగా దేశాలు దాటిపోయింది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులు, డ్యాన్స్ స్టెప్పులు ఇలా అన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేశాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించారు. బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మొదటి భాగం విడుదలై సంచలన విజయం సాధించడం తో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై దృష్టి పెట్టారు సుకుమార్ అండ్ టీమ్.

పుష్ప పార్ట్ 1 లో సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, కన్నడ నటుడు ధనుంజయ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ మూవీలో మరో సీనియర్ హీరోయిన్ కూడా యాడ్ అవ్వనుందని తెలుస్తుంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటి ఇంద్రజ పుష్ప 2 నటించనున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలు కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంద్రజ ఇప్పుడిప్పుడే పలు సినిమాలు చేస్తూ దూసుకుపితున్నారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీలో బంపర్ ఆఫర్ అందుకున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే పుష్ప 2 షూటింగ్ ను మొదలు పెట్టనున్నాడు సుకుమార్. ఇప్పటికే దీనిపై కసరత్తులు కూడా మొదలు పెట్టేశారు.

Indraja

Indraja

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మే నాకు స్ఫూర్తి.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. టికెట్స్ రేట్స్ విషయంపై..