
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనా ప్రతిభ, ప్రత్యేకమైన వ్యక్తిత్వం గురించి నటి జెనీలియా డిసౌజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానులఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్‌లో కేవలం నటన మాత్రమే కాకుండా, అందరినీ ఆకట్టుకునే ఒక ప్రత్యేకమైన గుణం ఉందని జెనీలియా పేర్కొనడం విశేషం. గతంలో జెనీలియా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియన్ నటులలో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వారి గురించి అడిగినప్పుడు, ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..
ఆయన్ను అద్భుతం, మహా అద్భుతం అని ప్రసంశించారు. అంతేకాకుండా, ఎన్టీఆర్‌లో ఏదో ఒక డివైన్ పవర్ ఉందని ఆమె స్పష్టంగా తెలిపారు. ఈ “డివైనిటీ క్వాలిటీ” ఎన్టీఆర్‌ను ఇతర నటుల నుంచి వేరు చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. జెనీలియా ఎన్టీఆర్‌తో కలిసి సాంబ, నా అల్లుడు వంటి రెండు చిత్రాల్లో నటించారు. ఆయన నటనను దగ్గరగా చూసిన అనుభవంతోనే ఆమె ఈ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ మూడు పేజీల డైలాగులను ఎలాంటి కష్టం లేకుండా, జస్ట్ క్షణాల్లో పేపర్‌ను చూసి చెప్పగలరని, అది కూడా పర్ఫెక్ట్ యాక్సెంట్, పర్ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌లతో అని ఆమె వివరించారు. దీనిని “రోబో లాగా డైలాగ్ చెప్పడం” అని జెనీలియా అభివర్ణించారు.
భారతదేశంలోని ఏ నటుడికీ ఈ క్వాలిటీ లేదని జెనీలియా చెప్పడం ఎన్టీఆర్ ప్రతిభకు నిదర్శనం. నటనలో ఈ స్థాయి కచ్చితత్వం, వేగం, భావం కలగలిసిన అరుదైన ప్రతిభ ఎన్టీఆర్ సొంతం అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయన ప్రతిభను, వ్యక్తిత్వాన్ని అభిమానులు ఎప్పటినుంచో ప్రశంసిస్తున్నప్పటికీ, సహ నటి జెనీలియా ఈ స్థాయిలో పొగడటం ఎన్టీఆర్ గొప్పదనానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇంకా తన పూర్తి టాలెంట్‌ను ఎన్టీఆర్ తెరపై చూపించలేదని, సరైన ప్రాజెక్ట్‌లు వస్తే ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుడు అవుతారని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి