
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం బాలీవుడ్ లోనే కాదు ఈ సినిమా ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ధురంధర్ సినిమా. గతేడాది డిసెంబర్లలో రిలీజైన ధురంధర్ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తాజాగా ధురంధర్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మార్చ్ 19న ధురంధర్ ది రివెంజ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. హిందీతో పాటు అన్ని భాషల్లో ధురంధర్ 2 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.
ఇక ధురంధర్ 2 సినిమాకు మొదటి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని టాక్ వినిపిస్తుంది. మొదటి రోజు ఈ సినిమా థియేటర్లలో రూ. 103 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కేవలం భారతదేశవ్యాప్త వసూళ్లు మాత్రమే. ఈ చిత్రాన్ని మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా కూడా విడుదల చేశారు. దీని ద్వారా రూ. 43 కోట్లు వసూలు కాగా, నివేదిక ప్రకారం మొదటి రోజు మొత్తం వసూళ్లు సుమారు రూ. 172.63 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ధురంధర్ 2 సినిమా పై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమా చెత్తగా ఉంది.. నాకు అస్సలు నచ్చలేదు, థియేటర్ లో నిద్రపోయాను అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. తాజాగా ధురంధర్ 2 సినిమా పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడే ధురందర్ 2 సినిమాను చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది సినిమా. దయచేసి థియేటర్‌లో చూసి టైం, మనీ వెస్ట్ చేసుకోకండి. ఇది ఓటీటీలో చూసే సినిమా. సినిమా పరమ చెత్తగా ఉంది. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ, ధురందర్ 2 నిరాశపర్చే సినిమా. అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. రణ్‌వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు.
Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.
It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.