Ravi Teja : రవితేజ పక్కన హీరోయిన్‏గా చేయాల్సింది.. కానీ రాత్రికి రాత్రే తీసేశారు.. బిగ్ బాస్ బ్యూటీ..

సినీరంగంలో నటిగా ఓ వెలుగు వెలగడం అంటే అంత సులభం కాదు. ప్రస్తుతం స్టార్ డమ్ అందుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారలు ఒకప్పుడు ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నవారే. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పాపులర్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. అలాగే ఒక్క అవకాశం ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మలు ఉన్నారు.

Ravi Teja : రవితేజ పక్కన హీరోయిన్‏గా చేయాల్సింది.. కానీ రాత్రికి రాత్రే తీసేశారు.. బిగ్ బాస్ బ్యూటీ..
Ravi Teja

Updated on: Apr 15, 2026 | 9:26 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణించడం అంత సులభమేమి కాదు. సినీరంగంలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న తెలుగులమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ముద్దుగుమ్మలు ఉన్నారు. తాజాగా ఓ అమ్మడు రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ రాత్రికి రాత్రే ఆ ఛాన్స్ పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మరెవరో కాదు.. నటి దివి వైద్య. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలు, సినీ ప్రముఖులతో తన అనుబంధం, రాబోయే చిత్రాల గురించి పంచుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని, ఆయన ఒక గురువు, మంచి స్నేహితుడు వంటి వారని దివి పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభం నుంచీ హరీష్ శంకర్ మద్దతు తనకు లభించిందని తెలిపారు. ఆస్కార్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్సన్ ఇండియాకు వచ్చినప్పుడు, తెలుగు నుండి ఇంగ్లీష్‌కి, ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువాదకురాలిగా దివి వ్యవహరించారు. ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకులు, కెమెరామెన్‌లు రాబర్ట్ రిచర్డ్సన్‌ను కలవడానికి వచ్చారు. హరీష్ శంకర్, బోస్, చోటా కె. నాయుడు, సెంథిల్ వంటి ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారు. వారిని కలవాలా వద్దా అనే నిర్ణయం తన చేతిలో ఉన్నప్పుడు, హరీష్ శంకర్ తనను సెట్‌కు పిలిపించి ఎంతో గౌరవంగా చూసుకున్నారని దివి చెప్పారు. అప్పటినుండి హరీష్ శంకర్ తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని, బిగ్‌బాస్ తర్వాత, ఏటీఎం వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పించారని, ఇప్పుడు మరో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..

రవితేజ సినిమాలో అవకాశం గురించి మాట్లాడుతూ, తనకు “లీడ్ రోల్ కాదు గుడ్ రోల్” దక్కిందని దివి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రవితేజ పక్కన హీరోయిన్‌గా ఒక అవకాశం వచ్చినప్పటికీ, రాత్రికి రాత్రే ఆ అమ్మాయిని మార్చేశారని, అది తనకు చాలా భావోద్వేగంగా ఉందని దివి వెల్లడించారు. ఆ రాత్రి తాను ఏడుస్తూ తన స్పీచ్ కూడా రాసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని, హరీష్ శంకర్ చేయమంటే చేస్తానని, వద్దు అంటే చేయనని, ఆయనంటే తనకు అంత గౌరవమని చెప్పారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఒక అవకాశం కోసం తాను ఎదురుచూశానని, రోల్ దక్కకపోయినా కనీసం పవన్ కళ్యాణ్ ను చూసి ఉంటే బాగుండేదని దివి అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా.. విడుదలైన మూడు రోజులకే సంచలనం..

“నాకు ఉంది కోరిక, నేను పెద్ద సినిమాల్లో హీరోయిన్ అవ్వాలి” అని ఆమె అన్నారు. కళ్యాణ్ కృష్ణ తనకు లంబసింగి సినిమాలో లీడ్ రోల్ ఇచ్చి ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు. లంబసింగి తన మొదటి సినిమా అని, ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దివి వివరించారు. ఈ సినిమాలో తాను స్వీట్‌గా ఉంటూనే రెబెల్‌గా కనిపిస్తానని, తనను ఒక డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నారని అన్నారు. తన చేతిలో కొన్ని మాత్రమే ఉంటాయని, డైరెక్టర్లు చెప్పినట్లే తాను చేస్తానని దివి పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Mangli : అతడికి శ్రీముఖి పై క్రష్.. బిగ్ బాస్ కోసమే ఈ ప్లాన్.. మంగ్లీ సంచలన కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..

Follow Us