Amala Paul: వైరల్ అవుతోన్న అమలాపాల్‌ లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. అందంతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ..

Amala Paul: అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ఒకరు. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంటారు అమలా. ఇక తాజాగా 'ఆహా' ఓటీటీ వేదికగా...

Amala Paul: వైరల్ అవుతోన్న అమలాపాల్‌ లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. అందంతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ..
Amala Paul

Updated on: Jul 20, 2021 | 5:44 AM

Amala Paul: అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ఒకరు. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంటారు అమలా. ఇక తాజాగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. టైమ్‌ లూపింగ్‌ అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో అమలాపాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. ఒకే టైమ్‌లో ఇరుక్కుపోయే పాత్రలో అమలా అద్భుతంగా నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌లో అమలా పాత్ర కీలకమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో అమలా పాల్‌ ఒక్కసారిగా మరోసారి లైట్‌ లైట్‌లోకి వచ్చారు.

ఇదిలా ఉంటే కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అమలాపాల్‌ నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు అమలా. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను అమలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో అమలా గ్లామర్‌ డోస్‌ను కాస్త పెంచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అమలా పాల్‌ అందమైన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

అమలా పాల్‌ ఫొటోలు..

Also Read: Raj Kundra Arrest: శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌.. యాప్స్‌ ద్వారా పోర్న్‌ సినిమాలు విడుదల చేశారంటూ..

OTT: ఒటీటీ సూపర్‌హిట్.. 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న మార్కెట్..మరింత వేగంగా విస్తరణ!

Kota Srinivasa Rao: జబర్ధస్త్, బిగ్ బాస్ షోలపై, అందులోని ఆర్టిస్టులపై సంచలన కామెంట్స్ చేసిన విలక్షణ నటుడు