మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 చిత్రాల షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు చిరు. అయితే ఇప్పుడు చిరు చేస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిత్రాల్లో కీలకపాత్రలలో పలువురు స్టార్స్ నటిస్తుండంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ కనిపించనుండగా.. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154లో మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా అభిమానులకు మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మెగా 154 చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేకర్స్.
యాక్షన్ ఎమోషన్ డ్రామాగా రాబోతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సముద్రఖని.. బాబీ సింహా.. కేథరిన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.