
టాలీవుడ్ విలక్షణ నటుడు శుభలేఖ సుధాకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ నటనా ప్రస్థానం, అరవింద సమేత చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి వివరించారు. తన కెరీర్లో ఎప్పుడూ ఒకేసారి పది, పదిహేను సినిమాలు చేతిలో లేవని, ఒక సినిమా పూర్తవగానే భగవంతుడి దయతో మరో అవకాశం లభించేదని అన్నారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నందున, దర్శకులు, నిర్మాతలు తనను పిలవడానికి సంకోచిస్తారని, కానీ పాత్రకు తాను సరైన వాడిని అనుకుంటే మాత్రం తప్పకుండా పిలుస్తారని పేర్కొన్నారు. అలా వచ్చిన అవకాశమే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అని తెలిపారు. త్రివిక్రమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని, నిర్మాత రాధాకృష్ణతో తన స్నేహం ఆత్మకథ సినిమా నుంచే ఉందని, ఫోన్ కాల్‌తో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో కలిశామని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..
ఒక పాత్ర చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని, దాని ప్రభావమే ప్రధానమని సుధాకర్ స్పష్టం చేశారు. నటుడి చేతిలో ఉన్నది ఉత్తమంగా ప్రదర్శిస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని చెప్పుకోచ్చారు. దీనికి ఉదాహరణలుగా ప్రతిఘటన చిత్రంలో కోట శ్రీనివాసరావు పోషించిన ఒక్క సీను గల తెలంగాణ స్లాంగ్ పాత్రను, ముత్యాలముగ్గులో మాడ వెంకటేశ్వర రావు చిన్న పాత్రను గుర్తు చేసుకున్నారు. ఈ పాత్రలు నిడివిలో చిన్నవైనా, ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..
అరవింద సమేత చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ప్రీ-క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌లో నటించడం తన అదృష్టంగా శుభలేఖ సుధాకర్ తెలిపారు. ఈ అనుభవం తన కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. ఎన్టీఆర్ అంటే చాలా మందికి ఎనర్జీ, నటన అని తెలుసునని, అయితే ఆయనను దగ్గరగా చూసినప్పుడు ఆయనలో అంతర్గతంగా ఉన్న తపన, కృషి, కసి స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. ఎన్టీఆర్ సెట్‌లో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారని, ఎప్పుడూ డైలాగులు చదువుకోవడం కనిపించదని సుధాకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టేక్ అనగానే, నాలుగు, ఐదు పేజీల డైలాగులను కూడా ఎప్పుడూ చదువుకోనట్లుగానే వచ్చి, సింగిల్ టేక్‌లో పూర్తి చేస్తారని ప్రశంసలు కురిపించారు. కెమెరామ్యాన్ లేదా పక్కన కో-ఆర్టిస్ట్ వల్ల పొరపాటు జరిగితే తప్ప, ఎన్టీఆర్ తరఫున ఎప్పుడూ పర్ఫెక్ట్ ఉంటుందని అన్నారు. ఒక సందర్భంలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టారేమో అని చెప్పిన మాటలను సుధాకర్ గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..
Subhalekha Sudhakar, Jrntr
ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..